- Home
- Astrology
- 15 రోజుల్లో ఈ 4 రాశులకు శుభవార్త.. సూర్యుడి నక్షత్ర మార్పుతో ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
15 రోజుల్లో ఈ 4 రాశులకు శుభవార్త.. సూర్యుడి నక్షత్ర మార్పుతో ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు నాలుగు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. సూర్యుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఓ నాలుగు రాశుల వారికి మేలు జరుగుతుంది.

మిథున రాశి
మిథున రాశి వారికి 15 రోజుల సమయం బాగా కలిసివస్తుంద. ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తులా రాశి
తుల రాశి వారికి సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభించవచ్చు. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు మంచి గుర్తింపు రావచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ పొదుపుపై దృష్టి పెడితే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాబోయే రోజుల్లో వృత్తి, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాల వల్ల పనుల్లో సహకారం లభించే అవకాశం ఉంది. అయితే డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

