Sun Mars Conjunction: సూర్య కుజ కలయిక వల్ల నెలరోజులు ఈ రాశులకు గోల్డెన్ డేస్
Sun Mars conjunction: జ్యోతిష్యంలో సూర్యుడు, కుజుడు ఎంతో ముఖ్యమైనవారు. అతి త్వరలో వృశ్చిక రాశిలో సూర్యుడు, కుజుడి కలయిక జరగబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి నెల రోజుల పాటూ మంచి రోజులు రాబోతున్నాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశివారికి ఏడో ఇంట్లో రవి-కుజ కలయికతో ఉద్యోగంలో మంచి పదవి లభిస్తుంది. వీరు సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి అనుకూల సమయం. ఈ రాశి వారు పోలీస్, మిలటరీ రంగాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి కచ్చితంగా ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవన్నీ తీరి హెల్తీగా ఉంటారు.
మిథున రాశి
మిథున రాశి వారికి సూర్య కుజ కలయిక ఎంతో మేలు చేస్తుంది. మిథున రాశి వారికి ఆరో ఇంట్లో రవి, కుజ కలయికతో వీరికి పోటీ ఉండదు. వీరు ఏ పోటీ పరీక్షలు రాసినా విజయం దక్కుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరతాయి.
సింహా రాశి
సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుడు… అతి త్వరలో కుజుడితో కలవడం వల్ల ఎన్నో మార్పులు కలుగుతాయి. వీరికి ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. వీరు సొంత వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తాయి. ఈ రాశివారు రాజకీయాల్లో ఉంటే వారి పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి మూడో ఇంట్లో రవి కుజ కలయిక జరుగుతుంది. దీని వల్ల వీరికి అధికార యోగం కలుగుతుంది. ఎవరైతే పోలీస్, మిలటరీ వంటి రంగాలలో ఉన్నారో వారికి ప్రమోషన్లు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా వీరు విజయం సాధిస్తారు. మీకు తోబుట్టువులతో ఉన్న ఆస్తి సమస్యలు కూడా తీరిపోతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇతను సూర్యుడితో కలసి రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. వీరికి రాజకీయ పలుకుబడి ఎంతో పెరుగుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నవారు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారం చేసేవారికి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. వీరికి శత్రు బాధలు ఉండవు. అప్పుల బాధలు తీరిపోయే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఇది ఎంతో మంచి కాలం. ఈ రాశిలో పదో ఇంట్లో రవి కుజ సంచారం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఉద్యోగంలో పదవి అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో వీరికి పుష్కలంగా లాభాలు వస్తాయి. వీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకుంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి అధికారం దక్కుతుంది.