Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రి, భర్త.. ఇద్దరికీ అదృష్టాన్ని తెస్తారు..!
ఈ తేదీలో అమ్మాయిల్లో మాత్రం వారు పుడుతూ పుడుతూ తమ ప్రియమైన వారికి అదృష్టాన్ని మోసుకొస్తారు. మెడలో తాళికట్టిన భర్త జీవితాన్ని కూడా అందంగా మార్చేయగలరు

న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ని బట్టి.. మన వ్యక్తిత్వాన్ని, జాతకాన్ని తెలుసుకోవచ్చు. ఈ రోజు కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిల గురించి తెలుసుకుందాం.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు... పుట్టినప్పటి నుంచి తండ్రికి.. పెళ్లి తర్వాత భర్తకీ అదృష్టాన్ని తీసుకువస్తారు. మరి, ఆ తేదీలేంటో ఓసారిచూసేద్దామా..

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమకు కొంతైనా అదృష్టం ఉంటే బాగుండు అని కోరుకుంటారు. కానీ, ఈ తేదీలో అమ్మాయిల్లో మాత్రం వారు పుడుతూ పుడుతూ తమ ప్రియమైన వారికి అదృష్టాన్ని మోసుకొస్తారు. మెడలో తాళికట్టిన భర్త జీవితాన్ని కూడా అందంగా మార్చేయగలరు.
ప్రతి నెలలో 1 నుంచి 30, 31 రోజులు ఉంటాయి. ఆ ప్రతి తేదీకి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కానీ, 3, 7, 11, 21, 29 తేదీల్లో జన్మించిన వారు మాత్రం చాలా శుభాలను మోసుకొస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు.. ఇంట్లోకి పాజిటివిటీని మోసుకొస్తారు.తల్లిదండ్రులకు అదృష్టాన్ని తెస్తారు.

ఈ నిర్దిష్ట తేదీలలో జన్మించిన మహిళలు వారి తల్లిదండ్రులకు, భాగస్వాములకు ఆనందం , విజయాన్ని అందిస్తారు. వారు ఉన్నచోట దాదాపు ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివితేటలతో నిండి ఉంటారు. అందంగానూ ఉంటారు. తమ ప్రియమైన వారి జీవితాల్లో దయతో నింపుతారు. వీరు పుట్టింట్లో ఉన్నంతకాలం.. తండ్రి గర్వంగా ఫీలయ్యేలా చేస్తారు. ఒక.. వివాహం తర్వాత వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యాన్ని కూడా పంచుతారు.

ఈ మహిళలు తమ కుటుంబాల స్థితి , ఆనందాన్ని పెంచడమే కాకుండా,వారు ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ఉండేలా చేస్తారు. అత్తా, మామలతోనూ అనురాగంతో మెలుగుతారు.భార్యభర్తల మధ్య కూడా గొడవలు రావు. భర్తను సంతోషంగా ఉంచడమే వీరి లక్ష్యంగా ప్రవర్తిస్తారు.