Birth Month: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలు పెళ్లయిన తరువాత భర్తలను శాసిస్తారట!
భార్యా భర్తల్లో ఎవరో ఒకరు డామినేషన్ చేసే వ్యక్తిలా ఉంటారు. ఒక ఇంట్లో భర్త శాసిస్తే… మరొక కుటుంబంలో భార్య శాసిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వారు భర్తలను శాసిస్తారట.

శాసించే భార్యలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకరి పుట్టిన నెల వారి వ్యక్తిత్వం, అలవాట్లు, సంబంధాలలో వారు ప్రదర్శించే లక్షణాలను ప్రభావితం చేస్తుంది.కుటుంబ సంబంధాలలో కొంతమంది స్త్రీలు నాయకత్వాన్ని చూపిస్తారు. వారు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే కుటుంబంపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఈ స్త్రీలు భర్తలపై ఆధిపత్యం చూపిస్తారు. వారు తమ మనస్సులో ఉన్నది ధైర్యంగా మాట్లాడతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ నెలల్లో పుట్టిన స్త్రీలు సంబంధాలలో ఎక్కువ ఆధిపత్యం చూపిస్తారో తెలుసుకోండి.
జనవరిి
జనవరి నెలలో పుట్టిన స్త్రీలు ధైర్యవంతులు, స్పష్టమైన లక్ష్యాలు కలిగి ఉంటారు. ప్రేమ సంబంధాలు లేదా వివాహ సంబంధాలు అయినా, వారు తమ అభిప్రాయాలలో దృఢంగా ఉంటారు. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. వీరిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం వారిని సహజంగానే ఆధిపత్యం కలిగిస్తుంది.
మార్చి
మార్చి నెలలో పుట్టిన స్త్రీలు భావోద్వేగపూరితులు, దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వారు తమ భాగస్వామితో భావాలను బహిరంగంగా పంచుకుంటారు. సంబంధాలను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.
జూలై
జూలై నెలలో పుట్టిన స్త్రీలు సహజంగానే రాజకీయ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు ఇతరులు తమను రాణిలాగా చూడాలని ఆశిస్తారు. అందుకే వారు కుటుంబాన్ని శాసిస్తూ ఉంటారు.
ఆగస్టు
ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీలు తుఫానులాంటి వేగమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు సంబంధాలలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలని కోరుకుంటారు. అలా వారు ఎక్కడ ఉన్నా ఆధిపత్యాన్ని చూపిస్తారు.
నవంబర్
నవంబర్ నెలలో పుట్టిన స్త్రీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. వారు చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. కానీ ఒక్కోసారి వారి ఉత్సాహం కొన్నిసార్లు హద్దులు దాటవచ్చు.