MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • 2023లో మిథున రాశివారి ఫలితాలు...!

2023లో మిథున రాశివారి ఫలితాలు...!

నూతన సంవత్సరం 2023లో మిథున రాశివారికి  కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

10 Min read
ramya Sridhar
Published : Dec 03 2022, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
gemini 2023

gemini 2023

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
 

215
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

315

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

2023 సంవత్సరంలో మీ  శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.  ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం లో హెచ్చు,తగ్గులు మిశ్రమంగా ఉంటాయి. కుటుంబంలో అపార్ధాలకు తావులేకుండా చూసుకోవాలి. మీ తెలివితో సమస్యలను ఎదుర్కొంటారు . తోటివారిని కలుపుకొనిపోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆగ్రహావేశాలను దరిచేరనీయకండి. నవగ్రహ సందర్శనం మంచిది. ఆదిత్య హృదయం పఠించాలి.
 

2023 లో వృషభ రాశివారి ఫలితాలు....!

415

జనవరి 2023
 
ఈ నెలలో  అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టువదలకండి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  నూతన వస్తువులు కొంటారు. ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి ఆహారనియమాలను పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
 
లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ విషయంలో కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. అనుమానాలు తలెత్తకుండా చూసుకోండి. మంచి కూడా గ్రహాలు అనుకూలించకపోతే చెడుగా కనపడుతుంది. 

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగస్దులు చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారస్దులకు పార్టనర్స్  విభేదాలు రావచ్చు. బిజినెస్ మందగించవచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
 
 ఆరోగ్యం:    అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.  మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. దాంతో ధనవ్యయం ఎక్కువగా వుంటుంది. అయితే అంతా అతి తక్కువ సమయంలోనే సర్దుకుంటుంది

515
gemini 2023

gemini 2023

ఫిబ్రవరి 2023

ఈ నెలలో  ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అయితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరికీ సాయం చేస్తూ మంచి ఫలితాలు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు.
 
లవ్ లైఫ్:    మీ జీవన భాగస్వామికి చెందిన అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. కుటుంబ జీవనంలో ఊహించని కొన్ని విషయాల్లో  ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. కొత్త నిర్ణయాలు కంగారుగా ఏమీ తీసుకోవద్దని సూచన.

ఉద్యోగం-వ్యాపారం:   ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి. వృత్తికి చెందిన శుభ వార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం:  ఈ నెలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. దాంతో టెన్షన్, బిపి పెరగటం, తలనొప్పి వంటివి కనపడతాయి. కంగారుపడద్దు.  ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన.

615

మార్చి 2023

 ఈ నెలలో కొన్ని సంఘనటనల వల్ల మీకు కుటుంబాన్ని మించిన బలం లేదని అర్దమవుతుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతే ఇబ్బందులు ఉండవు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరికీ సాయం చేస్తూ మంచి ఫలితాలు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.
 

లవ్ లైఫ్ :  ఈ   నెలలో మీ కోసం చాలా ఆనందకరమైన ఆశ్చర్యకరమైనవి వేచి ఉన్నాయి!  మీ భాగస్వామి మిమ్మల్ని   ఆశ్చర్యాలలో ముంచేస్తారు. తన స్నేహితులకు మిమ్మల్ని పరిచయం చేయవచ్చు!  ఇది ఖచ్చితంగా ఆశ్చర్యం!  భగవంతుడు మీపై తన ఎంపికైన బ్లెస్సింగ్స్  కురిపిస్తున్నాడు.  మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. 

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల లో ఉద్యోగ విషయమై ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. పై అధికారులతో ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్దులు  అలసటకు గురవకుండా చూసుకోవాలి.  ఉత్సాహవంతంగా పనులు చేయాలి. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మంచి ఫలితాలను పొందుతారు. 

ఆరోగ్యం:  మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వారిని కోప్పడవద్దు. ఒక తోబుట్టువు వారి సంబంధ సమస్యల గురించి ఆందోళన చెందుతారు. 

715

ఏప్రియల్  2023

ఈ నెలలో  మీకు  శుభఫలితాలు ఉన్నాయి. మంచి మనస్సుతో  చేసేపనులు త్వరగా సిద్ధిస్తాయి. కీలక విషయాల్లో  మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్ధికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచికార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి మీ అభివృద్ధికి  అడ్డురావు. అనవసర విషయాలతో కాలహరణ చేయకండి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబసభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఇష్టదైవ నామస్మరణ  శుభప్రదం.


లవ్ లైఫ్ : ఈ నెలలో మీ భాగస్వామితో  తలపెట్టిన పనులు నిర్విరామంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ కుటుంబ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను కుటుంబ పెద్దలు పెంచుకుంటారు. మరింత ఉత్తేజం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెలలో  చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి.

ఆరోగ్యం:  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నీటి ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయినా గ్రహాల అనుకూలత వల్ల చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త మార్పులు ఏమీ రోజువారి జీవితంలో చేయవద్దని సూచన.   అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి.  
 

815
Gemini

Gemini

మే  2023

ఈ నెలలో  ఉత్సాహంగా ఉంటారు.  చాలా ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. 15వ తేదీ నుంచి 24 వరకు కాలం మరింత అనుకూలం. అందరూ బాగా గౌరవిస్తారు. ధనవ్యయం అధికంగానే ఉన్నా, అవసరానికి తగిన ఋణం లభిస్తుంటుంది. కుటుంబం, ఉద్యోగం రెండు అంశాలనూ చాలా ఓర్పుగా నేర్పుగా సాగించుకుంటూ ముందుకు వెడతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ అభివృద్ధికి  అడ్డురావు. ఆర్ధికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఈశ్వర నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

లవ్ లైఫ్ :   పని ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మీ కుటుంబ జీవితానికి   సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. అలాగని మీ సమస్యలకు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలూ తీసుకోవద్దు.  లైఫ్ పార్టనర్ తో మెలిగేటప్పుడు ఓర్పు చాలా అవసరం.  బహు జాగ్రత్తలు పాటించాలి. వారి పర్శనల్ వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన..

ఉద్యోగం-వ్యాపారం:   వృత్తి,ఉద్యోగ,వ్యాపారంలో మిశ్రమఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధర్మచింతన అవసరం. వ్యాపారస్దులు   ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. 

ఆరోగ్యం:   ఈ నెలలో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆరోగ్య వ్యవహారాలలో ట్రీట్మెంట్ విషయమై ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి.  అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.
 

915

జూన్   2023
 
ఈ నెలలో  అతి జాగ్రత్త, మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా, మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన. ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం. కనకధారాస్తవం పఠించాలి.

లవ్ లైఫ్ : మీకు శుభకాలం. కుటుంబ అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఆ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. మీ లైఫ్ పార్టనర్ అండతో సమస్యలు అధిగమిస్తారు. 

ఉద్యోగం-వ్యాపారం: ఉద్యోగ పరంగా  అనుకున్నఫలితాలు సొంతం అవుతాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టే పనుల్లో సఫలీకృతులు అవుతారు.  ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాటవిలువను కాపాడుకోవాలి. వ్యాపారస్దులకు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లక్ష్యసాధనలో తోటి వ్యాపారస్దుల సహాయం లభిస్తుంది.  మనోబలాన్ని ఇస్తుంది.

ఆరోగ్యం:  నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి. మీరు మీ రోజు వారి దినచర్యను బాలెన్స్  చేసుకోవాలి మరియు ముఖ్యంగా సమయానికి తినాలి. వర్కవుట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడా చిన్నపాటి గాయాలు కాకుండా చూసుకోండి.  
 

1015
Gemini

Gemini


జూలై   2023

ఈ నెలలో  ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.  రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యం. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.

లవ్ లైఫ్ :మీ లైఫ్ పార్టనర్  కు వారి సొంత స్పేస్ ఇవ్వటం అవసరం. వారు కూడా ఒత్తిడితో కలిగి ఉండవచ్చు అని గ్రహించండి. మీరు ఇంట్లో ఉండడం, మీతో నాణ్యమైన సమయాన్ని గడపడం వంటివి చేయాలనుకున్నా సాధ్యం కాకపోవచ్చు. అపోహలకు తావివ్వకండి.

ఉద్యోగం- వ్యాపారం:  ఇతరుల గురించి ఎక్కువ సమాచారం ఇవ్వడంలో మీరు అతిగా మునిగిపోకుండా చూసుకోండి, ఎందుకంటే అది ఎదురుదెబ్బ తగలవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా,  ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైనవారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. 

  ఆరోగ్యం:  గర్భిణులు బహుజాగ్రత్తలు పాటించాలి.  తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. కొన్ని అంశాలలో విభేధాలు మిమ్మల్ని బాధపెడతాయి. మీ ఆరోగ్య విషయమై  తరచు ప్రస్తావన చేయద్దు.  
 

1115

ఆగస్ట్    2023

  ఈ నెల కోర్టు వ్యవహారాల్లో  కలిసి వస్తుంది. సెటిల్‌మెంట్‌  చాలా లాభం. తరచుగా సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నిస్తూంటే  టెన్షన్ కు  లోనవుతారు. వాటికి దూరంగా ఉండండి. అలాగే   వీలయినంత వరకు దూరప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. పనులు వాయిదా వేసే లక్షణాలు విడనాడండి. భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి. కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి.   అందువలన తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

 లవ్ లైఫ్ :   ఈ నెలలో కుటుంబ పరంగా మీకు ఇతర మంచి విషయాలు  జరగుతాయి. మీ భాగస్వామి మిమ్మల్ని చిన్నపాటి  వెకేషన్ కు మీకు ఇష్టమైన ప్లేస్ లలో ఒకదానికి తీసుకెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. కొద్ది పాటి ఉషారుతో మీ భాగస్వామి మీ ఇంటి ఫ్లోరింగ్‌ను డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చేస్తుంది. మొత్తం మారిపోతుంది.

ఆరోగ్యం:  గుర్తుపెట్టుకోండి..ఈ నెలలో  ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.  అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శించకుండా, ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీపని మీరు చేసుకుంటూ వెళితే ఆరోగ్య పరంగా అనుకూల ఫలితాలుసాధించే అవకాశం ఉంది. 

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగస్దులుకు ప్రమోషన్స్ వచ్చే సమయం. కాస్త కష్టపడితే మీరు అనుకున్న  కార్యాన్ని పూర్తి అవుతుంది. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్దులు మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి.  సినిమా వాళ్లకు అనుకూలం

1215

సెప్టెంబర్    2023

ఈ నెలలో మీకు అద్భుతమైన విజయాలు  రాసి పెట్టిఉన్నాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అవసరానికి  ధనం అందుతుంది. నిరంతర పరిశ్రమతో గొప్ప ఫలితాలు ఉంటాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సూచితం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా కూడా గతంలో కన్నా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు  జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ మీకు అనుకూలంగా వ్యవహించటం వల్ల అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎదుటి వారి మనస్సులో ఏముందో చూసే ప్రయత్నం చేయద్దు. మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. పూర్తిగా నమ్మండి. 

ఉద్యోగం- వ్యాపారం:   ఉద్యోగంలో  మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారస్దులకు పూర్తి అనుకూలం. దిగుమతులు బిజినెస్ లో ఉన్న వారికి కలిసి వస్తుంది. 

ఆరోగ్యం: మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మిగతా విజయాలు సాదించగలరనే విషయం మర్చిపోవద్దు. దాంతో   అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి, ప్రధానంగా ఆహార,విహారాల విషయంలో  మితం కావాలి.  ఓర్పు చాలా అవసరం. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. 
 

1315

అక్టోబర్    2023

 ఈ  నెలలో   తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఋణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ కలహాలు ఉంటాయి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తాయి. అవయవ ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. చతుష్పాద జంతువులు, ఆటోమొబైల్‌ వ్యాపారములు వృత్తులలో వున్నవారు,


లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ ని విమర్శించే కార్యక్రమాలు పెట్టుకోకండి.అలా చేస్తే మీ సమస్యలు మీరే కొని తెచ్చుకున్నట్లు. ఇంట్లో ఇప్పుడిప్పుడే సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. దాన్ని పాడు చేసుకోవద్దు.

ఉద్యోగం- వ్యాపారం: వృత్తి పరంగా చాలా పనులు మొదలుపెడుతుంటారు. ఏ పనీ సరిగా పూర్తి చేయలేరు. ఎవరి సహకారమూ అందదు. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచు కోపావేశాలు ప్రదర్శిస్తారు. వృథాగా సంచారం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్దులు ఆచి,తూచి అడుగు వేయాలి.

ఆరోగ్యం:  ఆరోగ్య విషయంలో మీరు నమ్మకమైన డాక్టర్స్ సూచనలు మాత్రమే తీసుకోండి. అన్ని రకాలు చిట్కాలతో మీ శరీరాన్ని ప్రయోగ శాల చేయకండి. గ్రహాలు మిమ్మల్ని వేరే విషయాలు వైపు ఉసిగొల్పుతాయి. మనో నిబ్బరంతో జయించండి.
 

1415

నవంబర్    2023
 
కులవృత్తిలో వున్నవారు ఈ  నెలలో చాలావరకు సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాలను తెలుసుకోగలుగుతారు.శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అన్ని సందర్భాల్లోనూ కుటుంబసభ్యులు ప్రోత్సాహం ఉంటుంది. భార్యాపుత్రుల విషయంలోను, కుటుంబంలోని పెద్దల అరోగ్య విషయంలోను అనుకూల స్థితి ఉంటుంది. బంధు సహకారం చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు, బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అంతా శుభసూచకమే. 

లవ్ లైఫ్ :   మీ కుటుంబ జీవితం కొద్దిపాటి ఒడిదుడుకులకు లోనవుతుంది. పిల్లల వల్ల సమస్యలు వస్తాయి. సీరియస్ కావు. ఇబ్బందిని కలిగిస్తాయి. దైవ ప్రేరణతో వాటంతట అవే తప్పుకుంటాయి. జీవిత భాగస్వామి మాటలు , చేతలు ధైర్యాన్ని ఇస్తాయి. కుటుంబమే అన్ని అని అర్దం చేసుకుంటారు.

ఆరోగ్యం:  ఈ నెలలో  ఆరోగ్యపరంగా గత సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ.  ధర్మకార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. దైవ అనుగ్రహం ఉంది. ఆరోగ్యం పూర్తి గా మెరుగు అవుతుంది.

ఉద్యోగం- వ్యాపారం:   వ్యాపారులకు సంవత్సరం అంతా పనివాళ్లతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. 
 

1515

డిసెంబర్    2023

అన్ని విధాలుగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. క్రమంగా కొన్ని సమస్యలు తీరుతున్నట్లుగా కనిపిస్తాయి. కానీ జనవరి నెలాఖరు వరకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ వుండవలసిన కాలం. ముఖ్యంగా వ్యవహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళేందుకు సిద్ధపడండి.  అవరోధం లేకుండా ఏ పనీ పూర్తి అవ్వదు. తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరికలు ఎక్కువ అవుతాయి. భార్యాపిల్లల ఆరోగ్యం, విద్య, వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గత పొరపాట్లు ఇప్పుడు కనువిప్పునిస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ భగవత్ ఆరాధనతో సమస్యల నుంచి బయిటపడచ్చు. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి.  

లవ్ లైఫ్ :  గ్రహసంచారం అనుకూలంగా ఉండటంతో మీ లవ్ లైఫ్ అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. మీ ఇద్దరి మధ్యా   లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వైవాహిక  సౌఖ్యం ఉంటుంది.

ఆరోగ్యం:    ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు అవసరం.   బంధుమిత్రుల రాకపోకలు సరదా కాలక్షేపాలతో కాలం గడుపుతారు. వాహన ప్రమాదం జరగకుండా చూసుకోండి.

ఉద్యోగం- వ్యాపారం:  గ్రహచారం అనుకూలత దృష్ట్యా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ   ఋణ వ్యవహారాలు సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు పడాలి.  
 ఈ నెలలో    విద్యా నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలం. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు గురుబలం, రాహుబలం బాగా అనుకూలించి లాభం పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. అవకాశం చూసుకొని ఋణ విషయాల్లో సెటిల్‌మెంట్‌ ధోరణిని అవలంబించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved