నేడు మిథునరాశి వారిని ఈ విషయాలు చాలా కలవరపెడుతాయి!
Gemini Horoscope: 12.09.2025 శుక్రవారానికి సంబంధించిన మిథున రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

మిథున రాశి ఫలాలు (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
నేడు మిథున రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
ఆర్థిక పరిస్థితి
ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అప్పుల ఒత్తిడి పెరగడం వల్ల ఆందోళన కలగవచ్చు. అనుకున్న టైంకి ఆర్థిక లావాదేవీలు జరగకపోవడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవడం, కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
చేపట్టిన పనులు మందకొడిగా సాగడం వల్ల ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. తొందరపాటు నిర్ణయాలు, అసహనం వల్ల ఇతరులతో అనవసర వివాదాలు వస్తాయి. కాబట్టి ఓపికగా ఉండటం చాలా అవసరం.
ఉద్యోగం
ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి పని పట్ల పూర్తి శ్రద్ధ, బాధ్యత అవసరం. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపరచుకోవడం, అధికారుల సూచనల్ని గౌరవించడం వృత్తి పరంగా మేలు చేస్తుంది.
వ్యాపారాలు
వ్యాపారాల్లో అనుకోని నష్టాలు తలెత్తే అవకాశముంది. వ్యాపార ఒప్పందాలు నిలిచిపోవడం, ఖాతాదారుల నుంచి ఆదాయం ఆలస్యం కావడం వంటి సమస్యలు రావొచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత లేకపోతే మనస్పర్థలు తలెత్తవచ్చు. వ్యాపార నిర్ణయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది.
ఆరోగ్యం
ఆరోగ్యపరంగా మిథునరాశి వారికి పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా, సంతాన ఆరోగ్య సమస్యలు కలవరపెట్టే అవకాశముంది. పిల్లల ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. తగిన వైద్య పరీక్షలు చేయించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా, పూజల వంటివి చేయొచ్చు.