Jupiter: గురు గ్రహానికి ఇష్టమైన రాశులు ఇవి, సంపదకు లోటు ఉండదు..!
Jupiter: గురు గ్రహం బలమైన స్థానంలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారి జీవితం చాలా అందంగా మారుతుంది. ముఖ్యంగా కెరీర్ లో దూసుకుపోతారు.ఆర్థికంగా కూడా వీరికి ఎప్పుడూ లోటు ఉండదు.

కర్కాటక రాశి..
కర్కాటక రాశి కి చంద్రుడు అధిపతి. ఈ రాశివారికి గురు గ్రహం గొప్ప స్థితిలో ఉంటాడు. అందుకే, ఈ రాశివారిపై ఎప్పుడూ గురు గ్రహ ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా, ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త బాధ్యతలు, కుటుంబంలో సంతోషం, సంతాన సౌభాగ్యం లాంటి ప్రయోజనాలు పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి కూడా గురు గ్రహం అధిపతి. ఈ కారణంగా, ధనుస్సు రాశిలో జన్మించిన వారిని గురుడు ఆశీర్వదిస్తాడు. అందుకే.. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ ఆస్తులు సంపాదించగలరు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి..
సింహ రాశికి అధిపతి సూర్యుడు. అయితే… సూర్యుడు, గురు గ్రహానికి మధ్య సహజంగా సామరస్యం ఉంటుంది. దీని వల్ల ఈ రాశివారిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి జీవితాంతం ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రతి రంగంలోనూ మంచి విజయం సాధిస్తారు.
మీన రాశి...
మీన రాశికి అధిపతి కూడా బృహస్పతే. మీన రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ గురుడి ఆశీర్వాదం పొందుతారు. వారు తమ పనిలో రాణిస్తారు. కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.