Jupiter retrograde: వ్యతిరేక దిశలో గురు సంచారంతో కోట్లు సంపాదించే రాశులు ఇవే
గురు వక్ర సంచారం (Jupiter retrograde) వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు. ఈ గురు సంచారం నవంబర్ 2025లో జరగనుంది. గురుగ్రహం మిధునరాశిలో వక్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుంది.

గురు వక్ర సంచారం ఎప్పుడు?
వేద జ్యోతిషంలో బృహస్పతి లేదా గురు గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురు గ్రహం శ్రేయస్సుకు, కీర్తి, సంపదకు కారకుడు. గురుగ్రహం కదలికలో మార్పు పన్నెండు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో గురు గ్రహం మిథునరాశిలో వక్ర సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల అయిదు రాశుల వారికి మేలు జరుగుతుంది.
మిధున రాశిలో గురుడి వక్రగమనం
గురువు దృష్టి పడిన రాశులకు ఎన్నో మంచి అవకాశాలు దక్కుతాయి. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయమనే చెప్పాలి.
తులా రాశి
తులా రాశి వారి తొమ్మిదవ ఇంట్లో గురు గ్రమం వక్రగమనంలో ఉండడం వల్ల వీరికి అద్భుత ఫలితాలు అందుతాయి. మీకు పెళ్లి విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వీరికి విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి.
మిధున రాశి
మిథున రాశి వారికి గురుడు వక్ర సంచారం ఎంతో బాగా కలిసి వస్తుంది. మీకు గౌరవం పెరిగే కాలం ఇది. మీరున్న ఇంట్లో సంతోషం అధికంగా ఉంటుంది. ఆస్తులు కొనేందుకు పెట్టుబడులు పెడుతారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఎంతో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఎంతో పురోగతి ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఎంతో కలుగుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు మంచి పురగోతి కలిసివస్తుంది. వ్యాపారంలో విపరీతంగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.
ధనూ రాశి
ధనుస్సు రాశి వారికి ఏడవ ఇంట్లో గురు వక్ర సంచారం జరగబోతోంది. ముఖ్యంగా ఇంట్లోని భార్యాభర్త మధ్య అనుబంధం పెరిగిపోతుంది. మీ సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఐదవ ఇంట్లో ఈ గురు వక్ర సంచార గమనం జరగబోతోంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి ఆ శుభవార్త వింటారు. ఇక కళారంగంలో ఉన్న వారికి ఎంతో మంచి అవకాశాలు వస్తాయి.