Solar Eclipse: మొదటి సూర్యగ్రహణం... ఈ రాశులకు కష్టాలు తప్పవు..!
Solar Eclipse: 2026 లో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరిలో సంభవించనుంది. ఈ సూర్య గ్రహణం మూడు రాశుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ మూడు రాశులకు ఊహించని కష్టాలు తప్పవు.

మొదటి సూర్య గ్రహణం...
2026 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న సంభవిస్తుంది. ఈ సూర్య గ్రహణం పాల్గుణ మాస అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణ సయంలో, సూర్య భగవానుడు శని గ్రహానికి సంబంధించిన కుంభ రాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం మూడు రాశులపై చాలా ఎక్కువగా పడనుంది. ఈ మూడు రాశుల మానసిక స్థితి, ఆరోగ్యం, ఆర్థిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనితో పాటు ఈ రాశుల వారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...
సింహ రాశి...
2026 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావం సింహ రాశివారిపై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా, మీ గౌరవ ప్రతిష్ఠలు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా, సింహ రాశివారు ఈ కాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎక్కువగా ఎదుర్కుంటారు. అదేవిధంగా, సింహ రాశివారు తమ కుటుంబ సభ్యులు చేసే పనుల కారణంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.
అంతేకాదు, ఈ విషయంలో సింహ రాశివారు అహంకారానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. లేకపోతే, మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. మీరు నోరు తెరిచి ఏది మాట్లాడినా ఇతరులతో గొడవలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
వృశ్చిక రాశి..
2026 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం వృశ్చిక రాశి వారికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు ఎవరికీ డబ్బు అప్పు గా ఇవ్వకపోవడమే మంచిది. పొరపాటున ఇస్తే... మళ్లీ అవి మీ చేతికి రావడం చాలా కష్టం. మీ ఖర్చులు కూడా అకస్మాత్తుగా పెరుగుతాయి. దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు తో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది. ఎందులో పెట్టుబడులు పెట్టినా.. నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
కుంభ రాశి...
2026లో వచ్చే మొదటి సూర్య గ్రహణం కుంభ రాశివారికి అనేక సమస్యలు తెచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు పెరుగుతాయి.అంతేకాదు.. ఈ గ్రహణ సమయంలో కుంభ రాశివారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. తీసుకునే నిర్ణయాల్లో గందరగోళం ఏర్పడొచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. చాలా ఇబ్బంది పడతారు.
అలాగే, ఈ కాలంలో సూర్యుని అశుభ ప్రభావం కారణంగా, కుంభ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ కాలంలో, కుంభ రాశి వారు తమ భావాలకు విలువ ఇవ్వడం, ఎవరికీ ఎలాంటి మాట ఇవ్వకపోవడం మంచిది, లేకపోతే మీరు పెద్ద సమస్య లేదా ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

