MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదా..?

గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదా..?

గ్రహణం పట్టడానికి 9 గం. ముందు నుంచి గ్రహం విడిచే వరకు కూడా ఏ రకమైన ఆహారాన్ని తీసుకోరాదు అని చెపుతారు ఎందువల్ల ?  

2 Min read
ramya Sridhar
Published : Oct 26 2023, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం  అక్టోబర్ నెల 29వ తేదీన ఈ రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది.

27
Lunar Eclipse 2023 Rashifal 3

Lunar Eclipse 2023 Rashifal 3

సూర్యుని చుట్టూ భూమి, భూమిచుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఈ రెండు ఒక్కోసారి సూర్యునితో ఒకే అక్షంపై ఉండడం కనిపిస్తుంది. ఒకే అక్షంలో సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావచ్చు. ఈ స్థితిలో సూర్యుని కాంతిని భూమి అడ్డగిస్తుంది. భూమినీడ చంద్రునిపై పడడంవలన చంద్రుడు కనపడడు. ఇదే చంద్ర గ్రహణం.
 

37
chandra grahan 2023 rashifal

chandra grahan 2023 rashifal

ఇది ప్రకృతి నియమం. ఈ సమయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి నియమాలను పాటించాలని చెప్పారు. భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహం చంద్రుడు. చంద్రుడు జలగ్రహం. మనఃకారకుడు. చంద్రుని ఆకర్షణ శక్తిచే సదా భూమిపై ఉండే జలవర్గం పై ప్రభావం పడుతూ ఉంటుంది. ఉదా : అమావాస్య పౌర్ణమి రోజులలో చంద్రుని ఆకర్షణశక్తి ప్రభావం వలన సముద్రం అల్లకల్లోలం అయి ఉప్పొంగుతుంది.

47
Image: Getty Images

Image: Getty Images

మానవ శరీరంలో కూడా 80 శాతం నీరు ఉండడం వలన ఈ రోజులలో మనిషికి చిత్త చాంచల్యం అధికంగా అయి, ఉద్రేకానికి గురి అవుతారు. కేవలం మాములు రోజులలోనే ఉద్రేకాలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహణ సమయంలో ఆ ఆలోచనలు విపరీత స్థాయిని దాటుతాయి గనుక ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండును. అందువలన గ్రహణ సమయంలో జపాలు మొదలైనవి చేసుకుంటూ ఎక్కడికీ బయికి వెళ్ళకూడదనే నియమం పెట్టారు. ఈ సమయంలోనే వేరు వేరు నియమాలు పాటించాలని చెప్పారు. ఇది కేవలం మూఢ నమ్మకం కాదు. దీనిలో వైజ్ఞానికత చాలా ఉంది.
 

57
Image: Getty Images

Image: Getty Images

ఆహార నియమాలు : గ్రహణం పట్టడానికి 9 గం. ముందు నుంచి గ్రహం విడిచే వరకు కూడా ఏ రకమైన ఆహారాన్ని తీసుకోరాదు అని చెపుతారు ఎందువల్ల ?

మన శరీరం 80 శాతం నీటితో నిండి ఉన్నందు వలన శరీరం ఈ ప్రభావానికి లోనగుతుంది. సముద్రమే అల్లకల్లోలం అవుతూ ఉంటే మనిషి శరీరం ఎంత. అతనిలో ఉండే జఠరాంగాలు, మూత్రకోశాలు, మెదడు మొదలైనవి అల్లకల్లోలం అవుతాయి. కాని ఈ పరిణామం అప్పుడే వెంటనే కనబడదు. పోను పోను ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది. గ్రహణ సమయంలో శరీరంలో ఆహారం జీర్ణం కాకుండా ఉంటే ఆ వ్యతిరేక శక్తికి కడుపులో అల్సర్లు,  వేరు వేరు రకాల అనారోగ్యాలు వచ్చే సూచనలు కనబడతాయి. తీసుకున్న ఆహారం పూర్ణంగా జీర్ణం అయిన అది రక్తంలో కలిసి పోవాలి. అప్పుడు మాత్రమే ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

67
Asianet Image

మనం తీసుకున్న ఆహారం శరీరంలో పూర్తిగా జీర్ణం కావడానికి 3 గంటల సమయం పడుతుంది. కాని అదే ఆహారం 9 గంటల్లో మొత్తం జీర్ణం అయి వ్యర్థపదార్థాలు కూడా శరీరంలో నుండి విడుదల కావడానికి సిద్ధంగా ఉంటాయి. ఏ కొంచెం ఆహారం కూడా శరీరంలో మిగిలి ఉండదు. కావున ఈ నియమాన్ని పాటించాలని చెపుతారు.

77
Asianet Image

స్నానం : మానవుని శరీరం ఎన్నో అణువులతో తయారు చేయబడింది. ప్రతి అణువు విభిన్నమైన శక్తి కలిగిన కిరణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆకర్షణ వికర్షణగల విద్యుత్‌ ఆకర్షణ శక్తి కేంద్రం. గ్రహణ కాలంలో చంద్రునిచే సంభవించే ఆకర్షణ శక్తిని ఈ అణుకోశాలుఆకర్షిస్తాయి. దీనిని ఎలక్ట్రో మ్యాగ్యిటిజమ్‌ అంటారు. ఇది దేహంలో ఎక్కువైతే శారీరక మానసిక ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. మానసికంగా ఆలోచించే శక్తి పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. దీనినే బండ తనం, మొరటుతనం అంటారు. ఈ విధంగా జరగడానికి ఈ గ్రహణ ప్రభావం కూడా ఒక కారణం అవుతుంది. కావున గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం మంచిది. కావున మన పూర్వీకులు ఈ విషయాలన్నీ చెప్పకుండ గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం మంచిది అని మాత్రమే చెప్పేవారు.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved