MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయో తెలుసా?

Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయో తెలుసా?

న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీని బట్టి మన భవిష్యత్తు, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు జీవితంలో వచ్చే చాలా రకాల సమస్యలను కూడా పుట్టిన తేదీ ఆధారంగానే  పరిష్కరించవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 11 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మనిషి గా పుట్టిన తర్వాత సమస్యలు లేకుండా ఉంటాయా? ప్రతి ఒక్కరికీ  ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవడానికి మనమంతా ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ, మనకు వచ్చే సమస్యలకు మన పుట్టిన తేదీని బట్టే పరిష్కారాలు ఉంటాయని మీకు తెలుసా? న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మీరు ఏం చేస్తే.. మీ సమస్యలన్నీ తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


నెంబర్ 1

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో మీరు జన్మించినట్లయితే న్యూమరాలజీ ప్రకారం మీ నెంబర్ 1 కిందకు వస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు స్వతహాగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా వెళ్లాలి? విజయం ఎలా సాధించాలని అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మీకు కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడొచ్చు. ఆ అడ్డంకులు తీరి, విజయం సాధించాలి అంటే ఈ తేదీల్లో జన్మించిన వారు ప్రతిరోజూ ఒక రాగిపాత్రలో నీటిని తీసుకొని సూర్యుడికి సమర్పించాలి. ఇలా రోజూ చేయడం వల్ల వీరు సక్సెస్ అవ్వగలరు.

310

నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారు వారి జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోవాలంటే.. ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రశాంతత మాత్రమే కాదు, అనుకున్న విజయం కూడా సాధించగలరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో తల్లి ఆశీర్వాదం కచ్చితంగా తీసుకోవాలి.

410

నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21,30 తేదీల్లో జన్మించిన వారు తమ సమస్యలు తీరాలన్నా, ఆనందంగా ఉండాలన్నా కేవలం ఒక మంత్రం జపిస్తే చాలు. 
ప్రతిరోజూ "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే చాలు. వారి సమస్యలన్నీ తీరిపోతాయి.

510

నెంబర్ 4..

4, 13, 22 , 31 తేదీలలో జన్మించిన వారు ప్రతిరోజూ దుర్గా చాలీసా చదవాలి. ఇలా చదవడం వల్ల వారి జీవితంలో సంతోషం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే చాలా సవాళ్ల నుంచి వారు బయటపడతారు.  దుర్గా దేవి ఆశీర్వాదం లభిస్తుంది.

610

నెంబర్ 5..
5, 14, 23 తేదీలలో జన్మించిన వారికి "ఓం గణగణపతయే నమః" అనే మంత్రం ప్రతిరోజూ చదవాలి. ప్రతిరోజూ ఆవుకు పచ్చి మేత కూడా అందించాలి. ఇలా చేయడం వల్ల  అదృష్టం వరిస్తుంది.

710


నెంబర్ 6..
6, 15, 24  తేదీలలో జన్మించిన వారు లక్ష్మీదేవి మంత్రాలను జపించడం మంచిది. ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవిని గులాబీ పూలతో పూజించడం వల్ల  ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.

810

నెంబర్ 7..
7, 16, 25  తేదీలలో జన్మించిన వారు ప్రతి రోజూ 10 నుండి 15 నిమిషాలు మాత్రమే క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మంచిది.వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం లాంటివి చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. 

910

నెంబర్ 8..
8, 17, 26 తేదీలలో జన్మించిన పురుషులు, మహిళలు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు, ఇది ధైర్యాన్ని  బలాన్ని పెంచుతుంది. అంతేకాకుండా,వీలైనంత వరకు ఇతరులకు సహాయం అందించాలి.

1010

నెంబర్ 9..

9, 18, 27 తేదీలలో జన్మించిన వారు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవాలి. తరచుగా రామ నామాన్ని జపించడం వల్ల అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా రకాల సమస్యలు కూడా తీరిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved