Lord Shani: శని దేవుడికి ఈ రాశి స్త్రీలంటే ఎంతో ఇష్టం, ప్రతి కోరిక తీరుస్తాడు
Lord Shani: ఒకరి జాతకంలో శని దేవుడు సానుకూలంగా ఉంటే అతడు మీకు రాజయోగాన్ని అందిస్తుంది. ఆయన మీకు డబ్బు, గౌరవం, అభివృద్ధి వంటివి ఎన్నో అందిస్తాడు. ఏ రాశి వారికి శనిదేవుడి అనుగ్రహం ఉంటుందో తెలుసుకోండి.

శని దేవుడు ప్రభావం
ఒక మనిషి జాతకంలో శని ఉత్తమ స్థానంలో ఉంటే ఎంతో మంచిది. అలాగే సంపద, గౌరవం, విజయం వంటివన్నీ అందిస్తాడు. ముఖ్యంగా శని దేవుడికి రెండు రాశులకు చెందిన స్త్రీలంటే చాలా ఇష్టం. ఏ రాశులకు చెందిన మహిళలో తెలుసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడితో శని దేవుడికి మంచి స్నేహం ఉంది. అందుకే వృషభ రాశి వారిపై శని ఎలాంటి చెడు ప్రభావం చూపించడు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు శని ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. వీరికి రాజకీయాల్లో కూడా విజయం దక్కుతుంది. సవాళ్లు ఎదురైనా త్వరగా వాటిని దాటుతారు.
మకర రాశి
మకర రాశి వారికి అధిపతి శని. అంటే మకర రాశి శని సొంతరాశి. అందుకే ఈ రాశి వారికి శని ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. చివరికి ఈ రాశివారికి ఏలినాటి శని కొనుసాగుతున్న కాలంలో కఠినంగా వ్యవహరించి ఉండడు. కొద్దిపాటి శ్రమపడినా చాలు మంచి ఫలితాలు పొందుతారు. వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి.