డిసెంబర్ 2021 ద్వాదశ రాశుల మాసఫలాలు
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో ధనాదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగుటకు , గౌరవ హాని సంఘటనలకు, ఆకస్మిక నష్టములు పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. నూతన కార్యములు ప్రారంభించుట మంచిది కాదు.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెల ప్రారంభంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆటంకాలు అధిగమించగలరు. దీర్ఘకాలిక సమస్యలను సొంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచనలు కార్య రూపం దాల్చును. కుటుంబ వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు లభించును. దైవ సందర్శన భాగ్యం లభించును. కుటుంబంలోని వ్యక్తుల వలన వ్యయం. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. 7,9 ,16 తేదీలు వ్యాపార రంగంలోని వారికి మంచిది. చివరి వారంలో మాత్రం దారి తప్పే ఆలోచనలతో మనశ్శాంతి లోపించును. అపార్ధాలు ఏర్పడును. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభించక నిరుత్సాహ పడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగుటకు , గౌరవ హాని సంఘటనలకు, ఆకస్మిక నష్టములు పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. నూతన కార్యములు ప్రారంభించుట మంచిది కాదు. ప్రధమ వారంలో రోహిణి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఆరోగ్య ఆపదలు ఏర్పడు అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయాల్లో మొండితనం మంచిది కాదు. ద్వితియ వారంలో ధనానికి ఇబ్బంది లేకున్నా మానసిక సంతృప్తి ఉండదు. మిత్రులే శత్రువులగును. బందువుల మాటతీరు పట్టించుకోనుట మంచిది కాదు. తృతీయ మరియు చివరి వారములు వివాహ ప్రయత్నములకు అనుకూలం. గృహంలో మార్పులు చేపడతారు. మాసాంతంలో వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో సంతాన సంబంధ లాభములు మరియు జీవన అభివృద్ధి లో లాభములు పొందుతారు.ధనాదాయం పెరుగును. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి లభించు సూచన. అందరి మన్ననలూ పొందుదురు. నూతన గృహ ప్రయత్నములు ఫలించును. మానసిక ఆలోచనలు అధికమగును. ప్రేమకలాపముల వలన ఆర్ధిక వ్యయం ఎదుర్కొందురు. ఈ మాసంలో ప్రారంభించు నూతన వ్యాపారములు విజయవంతం అగును. భాగస్వాములను సమకుర్చుకోగలరు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయుదురు.కళా రంగంలోని వారికి నూతన అవకాశములు లభించును. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ఆశించిన రుణాలు పొందగలుగుతారు.శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ ప్రయత్నములు అతి కష్టం మీద విజయవంతం అగును. 10 వ తేదీ తదుపరి వ్యాపార విస్తరణ కు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ కార్యములు విజయవంతం అగును. కోర్టు వ్యవహారములకు కూడా ఈ మాసం అనుకూలం . గృహ వాతావరణంలో సంతోషములు మధ్యమ ఆనందములు ఇచ్చును. ఈ మాసంలో 18,24, 25, తేదీలు అనుకూలమైనవి కావు. 15,16 తేదీలు వివాహ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో వ్యాపారాదులలో జయం , ఆఖస్మిక ధన ప్రాప్తి యోగం ఉన్నవి. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు పొందుతారు. వృత్తి వర్గం వారికి చక్కటి ధన లాభములు లభించును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు కలుగచేయును. తృతీయ వారంలో కుటుంబంలో అనారోగ్య కారణాల వలన కొద్దిపాటి మానసిక అశాంతి ఎదురగును. జీవిత భాగస్వామితో మద్యమ సంతోషాలు. దూరప్రాంత లేదా విదేశీ జీవన ప్రయత్నములు ఆటంకములతో ఫలించును. ఈ మాసంలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. ఈ నెలలో ప్రధమ ద్వితియ వారములు నూతన ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో శరీర ఆరోగ్యం బాగుండును. సంతాన ప్రాప్తి వలన ఆనందకరమైన కాలం పొందుదురు. కార్యానుకులాత లభించును.పరుష వాక్కుల వలన ఇబ్బందులు ఉన్నవి. వృత్తి వ్యాపారములు నిదానంగా కొనసాగును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతలు ఆర్జించేదురు. నిల్వ ధనం ఏర్పర్చుకోగలరు. ఈ మాసంలో 8,16,24 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ఉద్యోగ వర్గం వారికి స్థానమార్పు ఏర్పడు సూచన. కళత్ర సంబంధమైన ధన వ్యయం ఎదుర్కొందురు.. వాహనాల విషయాలలో క్రయవిక్రయాల వలన నష్టం. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో ఫలించును. అన్ని రంగముల వారికి ఆదాయం మెరుగ్గానే ఉండును. ద్వితియ వారంలో స్థిరాస్థి సంబంధమైన విలువైన సమాచారం లభించును. విజ్ఞాన శాస్త్రవేత్తలకు నలుగురిలో గుర్తింపు లభించును. కుటుంబ వాతావరణంలో ఆనందకరమైన క్షణాలు ఉన్నవి. తులారాశి కి చెందిన పెద్ద వారు ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్త వహించవలెను. కొత్త ప్రణాళికలు రచించుటకు ఈ మాసంలో చివరి రెండు వారాలు సరైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో 6 వ తేదీ తదుపరి లాభకరమైన పరిస్థితి పొందుతారు. గత రెండు నెలలలో ఎదుర్కొన్న చికాకులు క్రమేపి తొలగును. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమగును. నూతన లేదా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును. స్త్రీ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. చివరి వారంలో ప్రారంభించిన నూతన వృత్తి మార్గములు లాభించును. పితృ వర్గం నుండి ఆర్ధికంగా సహకారం లభించును. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కుటుంబ చికాకులు కొనసాగును. మహిళలు నిరాదరణ వలన భాదించబడతారు. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. ఈ మాసం 12, 13 తేదీలలో శరీరమునకు అలసట మరియు 20 నుండి 25 వ తేదీ మధ్య ఉద్యోగ జీవనము లో ఒత్తిడి, నడుస్తూ ఉన్న పనులలో విఘ్నతలు కలిగి చికాకులు ఏర్పడును. ఈ మాసంలో తలపెట్టిన ఆలోచనలు సజావుగా కార్యరూపం దాల్చవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో గృహ సంబంధమైన వ్యవహరాదులు సంతోషకరంగా నడుస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కళత్ర వర్గం వారి వలన తోడ్పాటు, లాభములు పొందుతారు. రుణాలకు సంబందించిన ఒత్తిడులు తొలగుతాయి. అవసరమైన పనులకు ధనం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు తొలగుతాయి. ఆశించిన విధంగా వైద్య సేవలు పొందగలుగుతారు.ఈ మాసం మొత్తం మీద అనుకూల ఫలితాలు ఏర్పరచును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో భూ లేదా గృహ సంబంధమైన ధన ప్రాప్తి. సువర్ణ సంబంధమైన లాభము పొందుతారు. కుటుంబ జీవనంలో సంతోషం. ద్రవ్య లాభములు కూడా ఉన్నవి. ఆశించిన రంగంలో విద్యార్ధులకు విజయం వరిస్తుంది. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన వ్యయం. ఇష్ట దైవ సందర్శన . మిత్రుల సహకారంతో పనులు వేగంగా పూర్తి అవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టుటకు మంచి సమయం. అవివాహితులకు వివాహ సంబంధమైన శుభ ఫలితాలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో ధన ఆదాయం పెరుగును. కుటుంబ సంతోషాలు పుష్కలంగా ఉన్నవి. పిన్న వయస్సు వారికి ఆశించిన వృద్ధి లభించును. విదేశీ ప్రయత్నాలు లాభించును. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగును. ఊహించని సంఘటనలు అనుభూతి చెందుతారు. ఈ మాసం కళారంగం వారికి ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యక్తిగత జీవన విధానంలో ధార్మిక ఆలోచనలు అమలు చేయగలుగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151