కన్య రాశి గురించి ఎవరికీ తెలియని చీకటి కోణం ఇదే..!
ఈ రాశివారికి పర్ఫెక్ట్ గా లేనివాళ్లు అంటే అస్సలు నచ్చదు. దారుణాతి దారుణంగా విమర్శిస్తారు. ఎదుటివాళ్లు బాధపడతారు అని కూడా చూడరు. విమర్శల దాడి చేస్తారు.
Astro
అన్ని రాశులలో కెల్లా స్వచ్ఛమైనది కన్య రాశి. ఈ రాశి వారిని చూసినప్పుడల్లా అందరికీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే.. ఈ రాశిలోని చీకటి కోణం అంత త్వరగా బయటపడదు. వీరు అందరికీ చాలా పరిపూర్ణంగా కనిపిస్తారు. కానీ వీరిలోనూ కొన్ని చీకటి కోణాలు ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం...
క్రూరమైన విమర్శకులు
కన్యరాశి వారికి, వారు చేసే ప్రతి పనిలో లేదా వారి ప్రతి సంబంధంలో పరిపూర్ణత ప్రతిబింబించాలి. తమ చుట్టూ ఉన్నవారు కూడా అంతే పర్ఫెక్ట్ గా , పరిపూర్ణంగా ఉండాలని వీరు కోరుకుంటారు. అలా ఉండకపోతే వారి నుంచి మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఈ రాశివారికి పర్ఫెక్ట్ గా లేనివాళ్లు అంటే అస్సలు నచ్చదు. దారుణాతి దారుణంగా విమర్శిస్తారు. ఎదుటివాళ్లు బాధపడతారు అని కూడా చూడరు. విమర్శల దాడి చేస్తారు. మాటలతోనే ఇబ్బంది పెడతారు. వారికి నచ్చినట్లు ఉంటేనే మంచిగా మెలుగుతారు. మిమ్మల్ని కనీసం గెలవనివ్వరు.
కన్య రాశి వారికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇది చాలా మంచి విషయమే. కానీ... ఇతరులు తమను ఎలా బాధపెట్టారు అనే విషయం కూడా వారికి గుర్తుంటుంది. అది మనసులో పెట్టుకొని ప్రతి నిమిషం వారిని బాధపెడుతూ ఉంటారు. ఇక తమకు గుర్తుంది కదా అని ప్రతి విషయాన్ని తమ పక్కన వారికి రిమైండర్ లా గుర్తుచేస్తూనే ఉంటారు. అది ఇతరులకు చిరాకు కలిగిస్తూ ఉంటుంది.
ఈ రాశివారు మంచిగా ఉన్నవారితో మంచిగానే ఉంటారు. కానీ.. ఎవరైనా తమను బాధపెట్టారు అంటే మాత్రం వారికి నరకం చూపించే వరకు వదిలిపెట్టరు. ఈ రాశివారిని ఒక్కసారి దూరం చేసుకుంటే.. మళ్లీ దగ్గరకు చేరడం కష్టం. కానీ ఈ రాశివారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. కానీ.... ఆ నవ్వు వెనక కోపాన్ని కూడా దాచిపెడుతూ ఉంటారు.
VIRGO
ఈ రాశివారు ముక్కుసూటిగా ఉంటారు. ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు. ఎదుటివారికి అసవరం లేకపోయినా సలహాలు ఇవవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. వారి నుంచి మీరు సలహా తీసుకోకుంటే కూడా విమర్శించడానికి ముందుకు వస్తారు. అది ఇతరులకు చిరాకు కలిగిస్తుంది. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలి అనుకుంటే కూడా వీరు ఉండనివ్వరు. మాటలతో వేధిస్తూ, విసిగిస్తూ ఉంటారు.