తుల రాశి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు
వారు అన్నీ తారుమారు చేశారు అనే విషయం గమనించేలోపు వీరు చేయల్సిందంతా చేసేస్తారు. తామను తాము కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఏదైనా చేస్తారు.
తుల రాశివారు గాలికి సంకేతం. వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఎవరైనా తమను కంట్రోల్ చేయడం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. వీరు సామరస్య వాతావరణాన్ని కోరుకుంటారు. ఈ రాశివారు ఉన్నత జీవితాన్ని ఆస్వాదిస్తారు. రెండువైపులా విషయం తెలుసుకోకుండా.. వీరు ఎవరినీ జడ్జ్ చేయరు. ఏదైనా తీర్పు ఇవ్వడానికి ముందు రెండు వైపులా విన్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఈ రాశివారు గుడ్డిగా ఎవరికీ సపోర్ట్ చేయరు. మరి ఇన్ని మంచి క్వాలిటీలు ఉన్న ఈ తుల రాశిలోనూ ఎవరికీ తెలియని కొన్ని చీకటి రహస్యాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
తులారాశి శాంతి, అందాన్ని ప్రేమిస్తుంది. ఈ రాశివారు సంపూర్ణ సమతుల్య స్థితిలో ఉండటానికి వారి స్వంత అవసరం కోసం, వారు ఘర్షణలను అసహ్యించుకుంటారు. కానీ ఘర్షణలు జరిగితే, వారి చీకటి కోణాలు బయటకు వస్తాయి. స్కేల్‌లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వారు చాలా తారుమారు చేయగలరు. వారు అన్నీ తారుమారు చేశారు అనే విషయం గమనించేలోపు వీరు చేయల్సిందంతా చేసేస్తారు. తామను తాము కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఏదైనా చేస్తారు. ఎదుటివారిని దారుణంగా దూషిస్తారు. అందరూ తమను కరెక్ట్ అని నిరూపించుకోవడానికైనా ఏమైనా చేస్తారు.
తారుమారు చేసినా, కేకలు వేసినా, పోరాడినా, దూషించినా వారు తప్పక గెలవాల్సిందే. ఏది చేసైనా గెలిచితీరుతారు. ఇతరులు గెలవడాన్ని వీరు జీర్ణించుకోలేరు. చేసేవన్నీ చేసి.. అందరి ముందు మాత్రం ఏమీ జరగనట్లు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. అలా నటించడం వారికి మాత్రమే సాధ్యం. ఎవరైనా వీరికి ఏదైనా ఆర్డర్లు వేస్తే వీరికి అస్సలు నచ్చదు.
Astro
వారు మానసికంగా చాలా త్వరగా తమను తాము వేరు చేయగలరు.ఎవరైనా తమకు కొంచెం దూరమైతే.. వారిని పూర్తిగా వదిలేస్తారు. దూరమైన బంధం గురించి వీరు అస్సలు ఆలోచించరు. దూరం వెళ్లిన వ్యక్తి మనసు మార్చుకొని మళ్లీ తిరిగి వీరికి దగ్గరకు వచ్చినా, వీరు తొందరగా స్వీకరించలేరు. వారిని విపరీతంగా బాధపెడతారు. మరో కొత్త బంధాన్ని వెతుక్కుంటూ ఉంటారు.
అందమైన వస్తువులు, అందమైన వ్యక్తుల ఆకర్షణలో తులరాశి వారు తొందరగా పడిపోతారు. ఈ రాశివారు పైపై మెరుగులకు ఎక్కువ విలువ ఇస్తారు. తమ జీవితం అందంగా ఉండాలని, ఇంట్లో వస్తువులను ఆకర్షణగా ఉండాలని, జీవితంలోకి వచ్చే వ్యక్తి అందంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వారిని మాత్రమే వీరు ఆహ్వానిస్తారు. అలాంటివారికి ఎక్కువ విలువ ఇష్తారు. అలా లేని జీవితాన్ని వీరు ఊహించుకోలేరు.
Libra Zodiac
తమకు తెలియనివారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వరు. ఇతరులు ధరించే దుస్తుల ఆధారంగా కూడా వీరు కొందరిని జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తార.