సింహ రాశి గురించి ఎవరికీ తెలియని చీకటి రహస్యాలు ఇవే..!
సింహరాశివారు మొండి పట్టుదలగలవారు. ఎవరికీ తలవంచరు. ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు. ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చేస్తారు. వారు ఎంత మొండి పట్టుదలతో వారు తమ చుట్టూ ఉన్న ఇతరులకు మరింత భరించలేని విధంగా చేస్తారు
సింహ రాశివారు శక్తికి మారుపేరు. చాలా డైనమిక్ గా ఉంటారు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు తాము కోరుకున్నది సాధించేవరకు వదిలిపెట్టరు. ఈ రాశివారు అంత తొందరగా నమ్మలేం. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చీకటి కోణాలు ఉంటాయి. ఎవరికీ తెలియనివి. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం... సింహ రాశిలో ఉన్న చీకటి కోణం ఏంటి..? వారి చీకటి రహస్యాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం...
Astro
సింహరాశి వారు కోరుకున్నది పొందే వరకు వదిలిపెట్టరు. వారు కోరుకున్నది దొరికితే వారు సంతోషంగా, నార్మల్ గానే ఉంటారు. కానీ, ఎప్పుడైతే వారు కోరుకున్నది దొరకలేదో... అప్పుడు వారిలోని చీకటి కోణం బయటపడుతుంది. వీరు చాలా భయకంరంగా ఉంటారు, ఇతరులను హింసించేలా , బాధపెట్టేలా ఈ రాశివారి చీకటి కోణం ఉంటుంది.
సింహరాశివారు మొండి పట్టుదలగలవారు. ఎవరికీ తలవంచరు. ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు. ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చేస్తారు. వారు ఎంత మొండి పట్టుదలతో వారు తమ చుట్టూ ఉన్న ఇతరులకు మరింత భరించలేని విధంగా చేస్తారు.వీరికి అహం కూడా చాలా ఎక్కువ. ఆ అహం కారణంగానే వారు ప్రతి విషయంలోనూ తామే కరెక్ట్ అనే భావన కలిగి ఉంటారు. వీరి అహం కారణంగానే కొత్త విషయాలను నేర్చుకోలేరు. అందరినీ ఆకర్షించలేరు.
అసూయ
వారు ఒక విచిత్రమైన అసూయతో బాధపడుతుంటారు. తమ భాగస్వాములు తమపై ప్రేమ చూపించకపోయినా వీరు తట్టుకోలేరు. తమ భాగస్వామి నిత్యం తమను అంత ఎత్తులో ఉంచి చూసుకోవాలని వీరు భావిస్తూ ఉంటారు. వారు డిమాండ్ చేసినా చేయకపోయినా, వారు ఎల్లప్పుడూ వారు ఇష్టపడే వ్యక్తి నుండి ప్రతి నిమిషం అటెన్షన్ కోరుకుంటారు. అటెన్షన్ చూపించకుంటే వారిలోని కోపం, అసూయ బయటకు వస్తాయి.
హింసాత్మక
ఈ రాశివారు హింసాత్మకంగా కూడా ఆలోచిస్తారు.. సింహరాశి స్థిరమైన అగ్ని సంకేతం. అంటే మేష రాశి వారి కంటే కూడా వారు వేడిగా ఉన్నారని అర్థం. హింసాత్మక స్వభావాన్ని స్వాధీనం చేసుకుంటే.. వారిని ఎవరూ ఆపలేరు. వారు ప్రేమ చూపించినంత వరకే బాగుంటుంది. ఒక్కసారి వీరు ద్వేషం చూపించాలి అనుకుంటే.. అది మిమ్మల్ని పూర్తిగా కాల్చే వరకు వదిలిపెట్టదు. అందుకే మీ జీవితంలో సింహ రాశివారు ఉంటే.. వారిని ఎప్పుడూ విస్మరించకండి.