నేడు ఓ రాశివారికి సొంత ఆలోచనలు అస్సలు కలిసిరావు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 9.10.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
వృషభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో ప్రమాద సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు.
మిథున రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ పెద్దలతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో లాభాలు వస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి ఫలాలు
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తులతో ఉన్న వివాదాలు తొలగిపోయి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు తొలగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
పిల్లల చదువు విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహపరుస్తుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
కుంభ రాశి ఫలాలు
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యల నుంచి బయటపడతారు.
మీన రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.