MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Transit: బుధుడి సంచారం- ఈ 4 రాశులవారు నక్కతోక తొక్కినట్లే! లక్కే లక్కు..

Mercury Transit: బుధుడి సంచారం- ఈ 4 రాశులవారు నక్కతోక తొక్కినట్లే! లక్కే లక్కు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచార ప్రభావం రాశిచక్రాలపై బలంగా ఉంటుంది. త్వరలో బుధ గ్రహ సంచారం జరగనుంది. దానివల్ల 4 రాశులవారి జీవితంలో కొత్త వెలుగు రానుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు రానున్నాయి. మరి ఆ రాశులేంటో చూద్దామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Oct 08 2025, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుధుడి సంచారం
Image Credit : Getty

బుధుడి సంచారం

జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని జ్ఞానం, తెలివితేటలు, వాణిజ్య నైపుణ్యాలు, వాక్చాతుర్యం, విద్య, అభివృద్ధికి కారకుడిగా భావిస్తారు. బుధుడి అనుగ్రహం ఉంటే సకల సంపదలు సిద్ధిస్తాయని నమ్ముతారు. బుధుడి దృష్టి సానుకూలంగా ఉంటే పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం అన్నీ నచ్చినట్టు జరుగుతాయట. జ్యోతిష్య పండితుల ప్రకారం అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. దానివల్ల కొన్ని రాశులవారి జీవితం అద్భుతంగా మారనుంది. 

పండితుల ప్రకారం.. బుధుడి రాశి మార్పు సాధారణమైనది కాదు. జ్ఞాన ద్వారాలు తెరుచుకునే క్షణం. త్వరలో జరగనున్న బుధుడి సంచారం కొన్ని రాశులవారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. అదృష్టం వారిని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో ఓసారి చెక్ చేసుకోండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

బుధుడి సంచారం వృషభ రాశి వారికి డబ్బుల వర్షం కురిపిస్తుంది. కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. పిల్లలు లేని దంపతులకు సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. బుధుడి సంచారం వల్ల ఈ రాశివారి వాక్చాతుర్యం పెరుగుతుంది. మీ మాటలు ఇతరులను ఆకర్షిస్తాయి. దానివల్ల సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

35
మిథున రాశి
Image Credit : Meta AI Generated

మిథున రాశి

బుధుడి సంచారం వల్ల మిథున రాశి వారు రాకెట్ వేగంతో దూసుకుపోతారు. వీరికి కష్టానికి మించిన ఫలితం లభిస్తుంది. మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి.. ఈ సంచారం ఈ రాశివారికి రాజయోగం లాంటిది. మీ మనసులోని గందరగోళాలు తొలగి, స్పష్టత పెరుగుతుంది. కొత్త అవకాశాలు, కొత్త ఒప్పందాలు, విదేశీ సంబంధాలు బలపడతాయి.

విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం, జీతాల పెంపు, పదోన్నతి వంటివి ఈ రాశివారిని ఆనందంలో ముంచెత్తుతాయి. మనోబలం, తెలివితేటలు పెరుగుతాయి.

45
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

బుధుడి సంచారం కన్య రాశి వారికి కూర్చునే టైం కూడా ఇవ్వదు. వృత్తి, కుటుంబం, సంతోషం, పెట్టుబడి, లాభం అనే మాటలను రోజూ పలికే పరిస్థితి వస్తుంది. కన్య రాశి బుధుడి సొంత రాశి కాబట్టి ఈ సంచారం కన్య రాశి వారి జీవితంలో విజయ ద్వారాలను తెరుస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు దక్కుతాయి. కొందరికి విదేశాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

వృత్తి రంగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సంతోషం, ఐక్యత నెలకొంటాయి. 

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి బుధుడి సంచారం అభివృద్ధికి బాటలు వేస్తుంది. వృత్తిలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. కొందరు కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దంపతుల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలు, బంధాలు జీవితంలో సంతోషాన్ని నింపుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా టాలెంటెడ్.. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తారు!
Recommended image2
Chanakya Niti: ఒక వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved