Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి జీవిత భాగస్వామితో గొడవ తప్పదు..!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 9.12.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలోలాభాలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
మిథున రాశి ఫలాలు
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయటా పనిఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కన్య రాశి ఫలాలు
అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆప్తుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
జీవిత భాగస్వామితో వివాదాలు వస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.
మీన రాశి ఫలాలు
సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఇంటా బయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

