Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 5.12.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
అన్నివైపుల నుంచి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మిథున రాశి ఫలాలు
అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయటా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
సింహ రాశి ఫలాలు
భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కన్య రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
తుల రాశి ఫలాలు
పాత అప్పులు తీరుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల గురించి మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.
మకర రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి ఫలాలు
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. డబ్బు విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.

