నేడు ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి!
ఈ రాశి ఫలాలు 4.09.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు.
మిథున రాశి ఫలాలు
దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి ఫలాలు
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.
తుల రాశి ఫలాలు
జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తప్పవు. దూరప్రాంత బంధువుల నుంచి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
పిల్లల విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో తోటివారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బందు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
ధనుస్సు రాశి ఫలాలు
మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. అందరూ మీ మాటతో ఏకీభవిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాల్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మకర రాశి ఫలాలు
మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభ రాశి ఫలాలు
ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు డబ్బు సహాయం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు అమలుచేసి లాభాలు పొందుతారు.
మీన రాశి ఫలాలు
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు, వాహన సౌకర్యాలు లభిస్తాయి. కొన్ని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.