నేడు ఈ రాశివారు విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!
ఈ రాశి ఫలాలు 31.08.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగులు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు. కొత్త వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు ఉంటాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
మిథున రాశి ఫలాలు
కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
పిల్లలకు సంబంధించిన శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలం.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగాల్లో స్వల్ప ఇబ్బందులుంటాయి.
కన్య రాశి ఫలాలు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లల ఆరోగ్యం విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాద సూచనలున్నాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పుల బాధ నుంచి ఉపశమనం దక్కుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.
వృశ్చిక రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి ఫలాలు
ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధించినా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మకర రాశి ఫలాలు
ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
మీన రాశి ఫలాలు
చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్నా మిత్రులు సహకారంతో పూర్తిచేస్తారు. భూ వివాదాల పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.