Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాలలో ప్రమాద సూచనలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.06.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో వివాహది శుభకార్యాలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిథున రాశి ఫలాలు
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. అనారోగ్య సమస్యలు వల్ల వ్యాపారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.
కన్య రాశి ఫలాలు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా బాధ్యతలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. రుణ ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మకర రాశి ఫలాలు
రాజకీయ వర్గం వారి నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా బాధ్యతల నుంచి కొంత ఉపశమనం పొందుతారు.
కుంభ రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తికావు. బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.
మీన రాశి ఫలాలు
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి పొందుతారు.

