నేడు ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగులకు కలిసివస్తుంది!
ఈ రాశి ఫలాలు 30.08.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘాకాలిక అప్పుల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు.
మిథున రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంట్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
కర్కాటక రాశి ఫలాలు
మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
సింహ రాశి ఫలాలు
బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో సోదరుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో కీలక సమాచారం తెలుస్తుంది.
కన్య రాశి ఫలాలు
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు.
తుల రాశి ఫలాలు
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
ధనుస్సు రాశి ఫలాలు
మిత్రులతో వ్యాపార విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
మకర రాశి ఫలాలు
ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీ చేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాల్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగులు సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. నూతన గృహ యోగం ఉంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో శారీరక శ్రమ తప్పదు.
మీన రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.