Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అరుదైన అవకాశాలు.. వ్యాపారాల్లో లాభాలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.07.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తల్లి తరపు బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉంది.
మిథున రాశి ఫలాలు
మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది.
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.
కన్య రాశి ఫలాలు
రుణ పరమైన సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అప్పులు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
మకర రాశి ఫలాలు
నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి ఫలాలు
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. డబ్బు విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

