నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.09.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యంగా అందుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.
వృషభ రాశి ఫలాలు
దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
మిథున రాశి ఫలాలు
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
కర్కాటక రాశి ఫలాలు
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
సింహ రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభకార్యాలకు ఆహ్వనాలు అందుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి.
తుల రాశి ఫలాలు
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో తోటివారితో చక్కగా వ్యవహరిస్తారు ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సమస్యలు చికాకు తెప్పిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మీన రాశి ఫలాలు
నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.