MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి తండ్రి తరపు వారితో మాటపట్టింపులు తప్పవు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి తండ్రి తరపు వారితో మాటపట్టింపులు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 20.10.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 20 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

రుణ సమస్యల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులతో కొత్త సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయటా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత అప్పులు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తండ్రి తరపు వారితో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహం గురించి ప్రస్తావన వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి డబ్బు సహాయం చేస్తారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు అబద్ధాలు చెప్పరు.. అబద్ధాలు చెప్పేవారిని దూరం పెడతారు
Recommended image2
Jupiter Moon Conjuction: గురు చంద్ర గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
Related Stories
Recommended image1
Biscuit Holes: బిస్కెట్స్‌పై చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Recommended image2
Telugu Saying: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved