Today Rasi Phalalu: నేడు ఈ 3 రాశులవారికి బాగా కలిసివస్తుంది.. అన్నీ అనుకూలమే!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 20.06.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.\
మిథున రాశి ఫలాలు
వాహన వ్యాపారులు నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.
కన్య రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు విజయం దక్కుతుంది. స్నేహితుల నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి, యాపారాలలో లాభాలు పొందుతారు.
తుల రాశి ఫలాలు
కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు.
వృశ్చిక రాశి ఫలాలు
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఇంటా బయటా పెద్దల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
మకర రాశి ఫలాలు
ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆటంకలు తొలుగుతాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.
కుంభ రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి ఫలాలు
ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృథా ఖర్చులు తప్పవు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి నిందలు పడాల్సి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

