MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 3 రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ.. అన్నీ ముందే తెలిసిపోతాయి!

Zodiac Signs: ఈ 3 రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ.. అన్నీ ముందే తెలిసిపోతాయి!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులవారికి అంతర్ దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను వీరు ముందే ఊహించగలరు. ఎదుటివారి మనసులో ఏముందో కూడా సులభంగా కనిపెట్టగలరు. మరి అలాంటి శక్తి ఉన్న రాశులేవో తెలుసుకుందామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 19 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిక్త్స్ సెన్స్ ఎక్కువగా ఉండే రాశులు
Image Credit : Getty

సిక్త్స్ సెన్స్ ఎక్కువగా ఉండే రాశులు

సాధారణంగా మనందరికీ ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారికి అంతర్ దృష్టి శక్తి అద్భుతంగా ఉంటుంది. జరగబోయే సంఘటనలను వీరు ముందుగానే పసిగడతారు. తమ చుట్టూ ఉన్న వారి నిజ స్వరూపాలను కూడా అర్థం చేసుకోగలరు. మంచి స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో సులభంగా గుర్తించగలరు. వీరి దగ్గర అబద్ధం చెప్పడం అసాధ్యం, ఎందుకంటే వీరు క్షణాల్లో అబద్ధాన్ని పసిగట్టేస్తారు. మరి అలాంటి శక్తి కలిగిన రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మీన రాశి
Image Credit : AI Generated

మీన రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీన రాశికి అధిపతి గురు గ్రహం. ఇది జల తత్వానికి చెందిన రాశి. ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితంగా, ఊహాశక్తితో ఉంటారు. వీరి మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలు లేదా కలలు ఎక్కువశాతం నిజమవుతాయి. వీరు ఇతరుల ఆలోచనలను, భావాలను సులభంగా చదివేయగలరు. అందుకే వీరి ముందు ఏ అబద్ధం పనిచేయదని పండితులు చెబుతున్నారు.

35
కర్కాటక రాశి
Image Credit : Gemini AI

కర్కాటక రాశి

కర్కాటక రాశికి చంద్రుడితో సంబంధం ఉంటుంది. చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలకు అధిపతిగా చెబుతారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ చుట్టూ జరిగే చిన్న మార్పులను కూడా వెంటనే గ్రహిస్తారు. ఎవరి ప్రవర్తనలో మార్పు అయినా లేదా రాబోయే ముఖ్యమైన కుటుంబ కార్యక్రమం అయినా, కర్కాటక రాశి వారు దాన్ని ముందే పసిగడతారు. వీరి సిక్స్త్ సెన్స్ చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది.

45
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత రహస్యమైన రాశులలో వృశ్చిక రాశి ఒకటి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు లోతైన ఆలోచనాపరులు. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకునే అద్భుతమైన కళ వీరికి ఉంటుంది. వీరి సిక్త్స్ సెన్స్ చాలా బలంగా ఉంటుంది. చాలాసార్లు వీరు ఎలాంటి ఆధారం లేకుండానే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నిర్ణయమే సరైనదని రుజువవుతుంది.

55
ఈ రాశులకే ఎందుకు స్ట్రాంగ్ సిక్త్స్ సెన్స్?
Image Credit : Getty

ఈ రాశులకే ఎందుకు స్ట్రాంగ్ సిక్త్స్ సెన్స్?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  మీన, కర్కాటక, వృశ్చిక రాశులు జల రాశులు. జల తత్వం అనేది భావోద్వేగాలు, సున్నితత్వం, ఆధ్యాత్మిక శక్తితో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ రాశుల వారు సూక్ష్మమైన సంకేతాలను సులభంగా గ్రహించగలరు. ఇతరుల కంటే మెరుగ్గా భవిష్యత్ సంఘటనలను అంచనా వేయగలరు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!
Recommended image2
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి జులైలో విపరీతంగా కలిసివస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved