Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 13.06.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువులు నుంచి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహించలేరు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తాయి.
సింహ రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. సంతాన ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. దీర్ఘకాలిక రుణ భాధలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
కన్య రాశి ఫలాలు
ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
తుల రాశి ఫలాలు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొత్త అప్పులు చేస్తారు. బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ధనుస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో నిర్ణయాలు తీసుకోలేరు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో వివాదాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండదు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.
మకర రాశి ఫలాలు
బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.
కుంభ రాశి ఫలాలు
స్థిరాస్తి విషయంలో సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీన రాశి ఫలాలు
దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి.

