Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి.. అనుకూల ఫలితాలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 10.10.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వ్యాపార భాగస్వాములతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు కొత్త సమస్యలు వస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
కొత్త కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
మిథున రాశి ఫలాలు
వ్యాపారాల్లో ఎంత శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో స్వల్ప వివాదాలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ఆర్థిక వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది.
కర్కాటక రాశి ఫలాలు
అప్పులు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలిసివస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య రాశి ఫలాలు
ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.
తుల రాశి ఫలాలు
దూర ప్రాంతాల బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.
వృశ్చిక రాశి ఫలాలు
ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు తెప్పిస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి.
మకర రాశి ఫలాలు
అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీన రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైనా సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.