నేడు ఓ రాశి వారికి స్నేహితుల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది!
ఈ రాశి ఫలాలు 1.09.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆఫీసులో కొత్త మార్పులు ఎదురుకావచ్చు. సహోద్యోగులు సహకరించకపోయినా ధైర్యం, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలం. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి కలహాలు వచ్చినా ఓపికగా పరిష్కరిస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో ఊహించని లాభం దక్కుతుంది. స్నేహితులతో కలిసి కొత్త పనుల మీద చర్చిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభదాయకం.
మిథున రాశి ఫలాలు
ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి. మీ సామర్థ్యాన్ని గుర్తించి పెద్దలు ప్రోత్సహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కాస్త జాగ్రత్త అవసరం. కొన్ని ప్రయత్నాల్లో మంచి ఫలితం దక్కుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
సింహ రాశి ఫలాలు
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. వృత్తి పరంగా మంచి పురోగతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఆర్థిక లాభం పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.
కన్య రాశి ఫలాలు
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొంచెం ఆలోచించి మాట్లాడాలి. పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది స్నేహితుల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. జాగ్రత్తగా ఉంటే అన్ని పనులు సాఫీగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. కొన్ని పనులు స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు కలిసివస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సాధారణం.
ధనుస్సు రాశి ఫలాలు
విద్యార్థులకు విజయాలు దక్కుతాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న ఒక పనిలో శుభవార్త వినే అవకాశం ఉంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేసుకునేందుకు ఇది మంచి సమయం.
మకర రాశి ఫలాలు
కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఒక శుభవార్త మీ మనసుకు సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సహనంతో ఉండాలి. తొందరపాటు వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.
మీన రాశి ఫలాలు
మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అన్ని వ్యవహారాల్లో స్నేహితుల సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు.