Zodiac signs: ఈ రాశుల పిల్లలు మహా ముదుర్లు.. వీళ్ల తెలివి ముందు ఎవరూ పనికిరారు..!
Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని రాశులకు చెందిన పిల్లలకు అసాధారణమైన తెలివితేటలు ఉంటాయి. వారి తెలివి తేటల ముందు ఎవరైనా తెల్ల మొహం వేయాల్సిందే. వారికి పుట్టుకతోనే ఆ తెలివితేటలు రావడం విశేషం.

zodiac signs
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేక లక్షణాలు, బలాలు, టాలెంట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి పిల్లల్లో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. కొందరు పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. మరి కొందరు మొండిగా ఉంటారు. కొంత మంది మాత్రం పుట్టుకతోనే తెలివితేటలతో ఉంటారు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం.. సహజంగా పుట్టుకతోనే తెలివితేటలు ఎక్కువగా ఉండే రాశులేంటో చూద్దామా....
1.మేష రాశి...
మేష రాశికి చెందిన పిల్లలు తల్లిచాటు బిడ్డలు. వీరు.. వాళ్ల అమ్మ ఏది చెబితే అది వింటారు. తల్లి మాట జవదాటరు. వాళ్ల అమ్మ ఏ పని చేయమంటే అదే చేస్తారు. కానీ... వీరు సహజంగా చాలా తెలివైన వారు. చూడటానికి కాస్త సున్నితంగా ఉంటారు. కానీ... వీరికి అన్నీ తెలుసు. వయసుకు మించిన విషయాలు వీరు తెలుసుకోగలరు.. అర్థం చేసుకోగలరు. ఈ రాశిని సూర్యుడు పాలిస్తాడు. కాబట్టి... ఈ రాశివారిపై సూర్య శక్తి కూడా ఉంటుంది. సూర్య శక్తి కారణంగా ఈ రాశివారి ఉత్సాహం, ధైర్యం, సవాళ్లను ఎదుర్కునే సామర్థ్యం కలిగి ఉంటారు. తమ ప్రయత్నాలు, నైపుణ్యాలు మాత్రమే నమ్మే మేష రాశికి చెందిన పిల్లలు... చదువుల్లో బాగా రాణించగలరు. తమ తెలివితేటలతో జీవితంలో బాగా రాణించగలరు.
2.కన్య రాశి...
కన్య రాశికి చెందిన పిల్లలు చాలా శాంతిప్రియులు. ముఖ్యంగా కన్య రాశికి చెందిన పిల్లలను దేవలతో పోలుస్తారు. వారు తమ పనిని తాము చేసుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ల పనుల్లో జోక్యం చేసుకోరు. కాకపోతే.. ఈ రాశివారు మొండిగా, కాస్త కొంటెగా ఉంటారు. వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉంటారు. పేరెంట్స్ చెప్పిన మాట వింటారు. తమ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. తమ మాటలతో అందరి మనుసు గెలుచుకోవడంలో వీరు ముందుంటారు. కన్యను పాలించే గ్రహం అయిన బుధుడు కష్టపడి పనిచేయడాన్ని ప్రోత్సహిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ గ్రహాన్ని తెలివైన గ్రహం అంటారు. ఈ గ్రహం ఆశీర్వాదాల కారణంగా, కన్య పిల్లలు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వారు చాలా కాలంగా నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోగల శక్తిని కలిగి ఉంటారు. అందువల్ల, జ్యోతిషశాస్త్రం ప్రకారం, కన్యారాశి పిల్లలు విద్యలో ప్రశంసలు పొందుతారు.
మకర రాశి...
మకర రాశి పిల్లలు కూడా చాలా తెలివైనవారు. వారు తమ వద్ద ఉన్న బొమ్మలతో సంతోషంగా ఆడుకోవాలని కోరుకుంటారు. అలాగే, ఈ పిల్లలు చదువులో అందరికంటే ఒక అడుగు ముందున్నారు. వారికి క్రీడా రంగంలో గొప్ప ఆసక్తి ఉంటుంది. గెలవడానికి కష్టపడరు. విజయం వారికి చాలా సులభంగా వస్తుంది. మకరరాశిని పాలించే గ్రహం అయిన శని కృషి, సహనం, బాధ్యతను ప్రోత్సహిస్తుంది. అందువల్ల, ఈ రాశి పిల్లలు ఎల్లప్పుడూ ప్రయత్నాలలో మునిగిపోతారు. వారు కోరుకున్న మార్కులు సాధించే వరకు వారు ప్రయత్నించడం ఆపరు. వారి గ్రహణ నైపుణ్యాలు అందరికంటే ఎక్కువగా ఉంటాయి.
మీన రాశి...
మీన రాశికి చెందిన పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడుతుంటారు. అంటే, మీరు వారికి బొమ్మలు కొంటే, వాటిపై వారి ఆసక్తి కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అప్పుడు వారు కొత్త బొమ్మ కొనాలని పట్టుబడతారు. పేరెంట్స్ చేత ఎక్కువ డబ్బులు ఖర్చు చేయిస్తారు. కానీ, ఈ పిల్లలు చాలా తెలివైనవారు. గురు గ్రహం మీనరాశిని పాలిస్తుంది. ఈ పిల్లలపై బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి, ఈ పిల్లలు అన్నింటిలోనూ ముందుంటారు. తమ తెలివితో అన్నింట్లోనూ విజయం సాధిస్తారు.