చాణక్య నీతి: జీవితంలో వీళ్లకు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!
చాణక్య నీతి ప్రకారం.. జీవితంలో కొందరికి ఎప్పటికీ దూరంగా ఉండాలట. ముఖ్యంగా మన బంధువులకే దూరంగా ఉండాలట. ఎందుకో, చాణక్య నీతి ఏం చెబుతుందో తెలుసుకుందాం...
చాణక్యుడు మనం మన జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఎప్పుడో చెప్పారు. జీవితంలో విజయం సాధించాలి అంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో కచ్చితంగా తెలుసుకోవాలి. దాదాపు మనలో అందరూ.. మన చుట్టూ ఉన్నవారందరినీ ఈజీగా నమ్మేస్తూ ఉంటాం. మన వాళ్లే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ.. అక్కడే సమస్య మొదలౌతుందని చాణక్యుడు చెబుతున్నాడు. మనతో ఉన్నవాళ్లంతా మన వాళ్లు కాదని, కొన్ని సార్లు బంధుమిత్రులే మనల్ని మోసం చేసే ప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు. అందుకే బంధువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, మనవాళ్లుు అనుకుంటేనే బాధ ఎక్కువగా ఉంటుంది.
మనతో ఎవరు మంచిగా ఉంటున్నారు... ఎవరు మనకు హాని చేస్తున్నారు అనే విషయం గుర్తించడం కష్టమే. మనకు హాని చేసే బంధువులను సులభంగా గుర్తించలేం. మనకు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాతే ఎవరు ఎలాంటివారు అనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే ఎక్కువ మంది తమ బంధువుల చేతుల్లోనే మోసపోతుంటారు.
నెగెటివ్ ఆలోచనలు తెచ్చే బంధువులకు దూరం
అందుకే చాణక్య నీతి ఫాలో అయితే.. మీరు నష్టపోకుండా ఉంటారు. కొంతమంది బంధువులతో మాట్లాడితే నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. అలాంటి వారితో సంబంధం పెట్టుకోకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఎలాంటి వారికి దూరంగా ఉండాలో చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం....
మోసం చేసిన బంధువులను నమ్మకండి
ఉపకారం చేసిన బంధువులు ఉన్నారు, మోసం చేసినవారు కూడా ఉన్నారు. చెడ్డవారికి దూరంగా ఉండండి. మోసం చేసిన బంధువును మళ్ళీ నమ్మకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఎప్పుడూ మిమ్మల్ని విమర్శించే, అవమానించే బంధువులకు దూరంగా ఉండండి.
గొడవ చేసే బంధువులకు దూరంగా ఉండు
ఇంటికి వస్తే గొడవ చేసే బంధువులకు దూరంగా ఉండండి అని చాణక్యుడు చెబుతున్నాడు. కొంతమంది బంధువులు ఇంటికి వస్తే అశాంతి. రోజంతా చిరాకు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మాట్లాడితే మానసిక ఒత్తిడి కలిగించే బంధువులకు దూరంగా ఉండండి.
కష్టంలో వాడుకునే బంధువులు
కష్టంలో మనల్ని వాడుకునే బంధువులను వదిలేయండి. కష్టంలో సహాయం చేయని బంధువు వద్దు. కొంతమంది బంధువులు సుఖంలోనే ఉంటారు, కష్టంలో ఉండరు. మన మంచిని చూసి ఈర్ష్యపడే బంధువులకు దూరంగా ఉండండి.