కర్కాటక రాశి వారికి నేడు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసా?
9.09.2025 మంగళవారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశి వారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

కర్కాటక రాశి ఫలాలు (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
నేడు కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
ఆరోగ్యం
కర్కాటక రాశివారు నేడు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం, టైంకి నిద్రపోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
ఆర్థిక పరిస్థితి
ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఆదాయం, లాభాలు వస్తాయి. ఆర్థిక ఒత్తిడుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మంచి సమయం. ఖర్చులు తగ్గించి, పొదుపు మీద దృష్టి పెడితే మరింత మేలు జరుగుతుంది.
ఉద్యోగం
ఉద్యోగులకు అనుకూల సమయం. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు మంచి గుర్తింపు దక్కుతుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు లేదా జీతం పెరగవచ్చు. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.
వ్యాపారం
ధైర్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ప్రాజెక్టులు మొదలుపెట్టి ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనుల్లో విజయం దక్కుతుంది. కొత్తదనాన్ని అంగీకరించి ధైర్యంగా ముందుకు వెళ్తారు.
కుటుంబ జీవితం
కుటుంబానికి సంబంధించి కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు..
సూచనలు:
- అవకాశాలను అందిపుచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి.
- కుటుంబ విషయాల్లో ఓర్పుతో నిర్ణయాలు తీసుకోండి.
- ఆర్థిక లావాదేవీల్లో బాధ్యతగా ఉండండి.
- ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు.