Shani Transit:ఈ ఏడాది ముగిసేలాగా.. శనీశ్వరుడి అనుగ్రహం, ఈ ఐదు రాశులకు మహర్దశ..!
Shani Transit: శని ప్రస్తుతం మీన రాశి లో తిరోగమనంలో ఉన్నాడు. కానీ, సంవత్సరం చివరి నాటికి, అది నేరుగా మీన రాశిలోకి వెళ్తుంది. దీని కారణంగా కొన్ని రాశులకు అదృష్టంగా మారనుంది. అపారమైన సంపద, ప్రతిష్ఠ పెరగనుంది. శని ఆశీర్వాదం లభించనుంది.

Shani Transit
వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, శనిని న్యాయదేవత గా పరిగణిస్తారు. ఈ శని ప్రస్తుతం మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ ఏడాది చివరి నాటికి.. పూర్తిగా మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. అంటే, శని ప్రత్యక్ష దిశలో కదలడం మొదలుపెడతాడు. దీని కారణంగా... కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది. ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే... ఆ డబ్బులు ఈ సమయంలో చేతికి అందే అవకాశం ఉంది. కెరీర్ కూడా బాగుంటుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..
తుల రాశి....
మీన రాశిలోకి శని ప్రత్యక్ష సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి తుల రాశివారి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా... కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే.. వాటిల్లో విజయం సాధించగలరు. శత్రువులపై కూడా విజయం సాధిస్తారు. కొత్త వాహనం, ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ పిల్లల విషయంలో శుభవార్త వింటారు. దీర్ఘకాలికంగా ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే.... వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కుంభ రాశి....
శని ప్రత్యక్ష సంచారం కుంభ రాశి వారికి చాలా సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. శని కుంభ రాశికి అధిపతి. అంతేకాకుండా.. శని నేరుగా ఈ రాశి రెండో ఇంట్లోకి అడుగుపెడతాడు. దీని కారణంగా... కుంభ రాశి వారికి చాలా మేలు జరగుతుంది. వారి సంపద పెరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశిలో శని ఏలినాటి దశ చివరి దశలో ఉన్నాడు. దీని కారణంగా... ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందగలరు. వ్యాపారాల్లో మంచి లాభాలు చూస్తారు. ఈ సమయంలో మాట్లాడటం, కమ్యూనికేషన్ లేదా మార్కెటింగ్ తో కూడిన కెరీర్ లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ఛాన్స్ ఉంది. ఏ పని చేసినా.. లాభాలు మాత్రం పొందగలరు.
మకర రాశి...
శని మీన రాశిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం మకర రాశివారికి చాలా మేలు చేయనుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ధైర్యం చాలా ఎక్కువగా పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఏ పని చేసినా అందులో విజయం సాధించగలరు. మీరు మీ తోబట్టువులతో కూడా మంచి సంబంధాలను పెంచుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఏ వ్యాపారాలు ఎంచుకున్నా.. భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథున రాశి....
శని సంచారం మిథున రాశి వారికి చాలా సానుకూల మార్పులను తీసుకురానుంది. మీ కెరీర్, వ్యాపార రంగాలలో శని సంచారం మీకు చాలా ప్రయోజనాలు మోసుకురానుంది. వ్యాపారం చేసే వారికి ఇది గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. అన్ని సమస్యలను పరిష్కరించగలరు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించగలరు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తండ్రితో అనుబంధం పెరుగుతుంది.
వృషభ రాశి...
శని ప్రత్యక్ష సంచారము వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉండవచ్చు. ప్రస్తుతం, శని మీ రాశి నుండి 11వ ఇంట్లో ఉన్నాడు, ఇది ఆదాయం, లాభానికి నిలయంగా పరిగణిస్తారు. ఈ స్థానం మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు.