- Home
- Astrology
- Budhaditya Raja Yoga: సూర్యుడు బుధుడు కలిసి శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం, ఈ రాశులదే అదృష్టమంతా
Budhaditya Raja Yoga: సూర్యుడు బుధుడు కలిసి శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం, ఈ రాశులదే అదృష్టమంతా
సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని (Budhaditya Raja Yoga) ఏర్పరుస్తారు. ఈ యోగం ఎంతో శక్తివంతమైనది. దీని వల్ల కొన్ని రాశుల (Zodiac Signs) వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

సూర్యుడు బుధుడు కలిసి..
జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాలు కలిసి శుభ లేదా అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. శుభ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి విపరీతంగా ఆర్ధికంగా కలిసివస్తుంది. సెప్టెంబర్ 17న సూర్యుడు, బుధుడి కలయిక జరగనుంది. బుధ భగవానుడు సెప్టెంబర్ 15 నుంచి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న సూర్యభగవానుడు కూడా కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు పొందబోతున్నారు.
సింహ రాశి
సెప్టెంబర్ 17న జరిగే సూర్య, బుధుల కలయిక వల్ల సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఈ కలయిక మీ రాశికి రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం, లాభాలు పొందుతారు. ఈ రాజయోగం మీ వ్యక్తిత్వంలో కూడా మార్పు తెస్తుంది. స్వయం ఉపాధి, వ్యాపారం చేసేవారు ఈ కాలంలో మంచి లాభాలు చూస్తారు.
వృశ్చిక రాశి
సూర్యుడు, బుధుడు కలిసి వృశ్చిక రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ శుభ యోగం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. దీనివల్ల లాభం, ఆదాయం పెరుగుతాయి. ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉంటుంది. పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు రాశి
బుధాదిత్య రాజయోగం ధనుస్సు రాశి వారికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ కలయిక ధనుస్సు రాశి వారి వృత్తి, వ్యాపార గృహంలో ఏర్పడుతుంది. ఫలితంగా, మీరు పనిలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధిస్తారు. రాబోయే రోజుల్లో కార్యాలయంలో అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.