Budh Gochar: సెప్టెంబర్ ముగిసేలోగా ఈ మూడు రాశులపై కనకవర్షం కురవడం ఖాయం..!
Budh Gochar: జోతిష్యశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 30, 2025న ఉదయం 8గంటల 22 నిమిషాలకు బుధుడు దక్షిణం వైపు తిరోగమనం చేయనున్నాడు. అంటే ఈరోజు బుధ గ్రహం దక్షిణం వైపు తిరుగుతుంది. ఈ అరుదైన ఘటన కారణంగా మూడు రాశులకు చాలా శుభఫలితాలు కలగనున్నాయి.

బుధ సంచారం..
ప్రతి గ్రహానికి దాని సొంత ప్రత్యేకత ఉంటుంది. కొన్ని గ్రహాలు తమ రాశి, నక్షత్రాన్ని మాత్రమే మారుస్తాయి. కొన్ని గ్రహాలు నేరుగా వాటంతట అవే కదులుతూ ఉంటాయి. కొన్ని మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా అవి తిరిగే క్రమాన్ని బట్టి.. కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాగా... బుధగ్రహం సెప్టెంబర్ 30, 2025న దక్షిణం దిశలో తిరోగమనం చేయనుంది. మరి.. ఈ తిరోగమనం... ఏ రాశులకు అదృష్టాన్ని తీసుకురానుందో ఇప్పుడు తెలుసుకుందాం...
1.మేష రాశి...
బుధ గ్రహ తిరోగమనం మేష రాశివారికి చాలా మేలు చేయనుంది. తమ చుట్టూ ఉన్నవారితో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పని చేసే చోట అంతా వీరికి అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ ముగిసేలాగో.. వీరి ఇంట కాసుల వర్షం కురుస్తుంది. ఎందుకంటే.. ఈ కాలంలో వీరి ఆదాయం పెరిగే మార్గాలు చాలా ఏర్పడతాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉన్న వారు అయితే.. కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువ. సీజనల్ గా ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఉండదు.
2.తుల రాశి...
బుధుడు అనుగ్రహం కారణంగా, తులారాశిలో జన్మించిన వ్యక్తులు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ సమయంలో వీరికి ఊహించని వైపు నుంచి డబ్బు అందుతుంది. అయితే.. వచ్చిన డబ్బును ఎలా పడితే అలా ఖర్చు చేయకూడదు. పెట్టుబడి పెట్టడం లేదా... పొదుపు చేయడం లాంటివి చేయాలి. ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అదేవిధంగా, తులారాశిలో జన్మించిన వ్యక్తులు పనికి సంబంధించి గరిష్ట ప్రయోజనాలను పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఈ కాలంలో కుటుంబ జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలు చాలా తగ్గుతాయి.సంబంధాలలో మంచి సామరస్యం పెరుగుతుంది.
తులారాశిలో జన్మించిన విద్యార్థులు ఈ కాలంలో కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీని కారణంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ప్రయోజనాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో, మీరు మీ అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.
మీన రాశి..
దక్షిణం వైపు బుధుడు తిరోగమనం మేషం ,తులారాశిలో జన్మించిన వారితో పాటు మీనరాశిలో జన్మించిన వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో, మీన రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషకరంగా మారుతుంది. అయితే.. ఎవరితో అయినా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక.. ఉద్యోగంలో చేసిన పనికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. సాహోసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే మంచి స్థాయిలో ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించి తీసుకుంటే సరిపోతుంది. ఆర్థికంగా మాత్రం మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.