మీన రాశి గురించి ఈ భయంకర నిజాలు తెలుసా..?
ఈ రాశివారు.. రొమాన్స్ విషయంలో కాస్త వెనకపడతారు. ఆ విషయంలో తేడాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. అలా విడిపోతే.. మళ్లీ కొత్త బంధానికి అలవాటుపడటం వీరికి చాలా కష్టం.

మానవ సంబంధాలు ఎంతో అందంగా ఉంటాయి.. అంతే సంక్లిష్టంగానూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక బంధాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రేమ బంధాన్ని కోరుకోనివారు ఎవరుంటారు చెప్పండి. కొందరికి కొన్ని బంధాలు పుట్టుకతోనే వచ్చేస్తుంటాయి. లేని బంధాల కోసం పరితపిస్తూ ఉంటారు. వీటిలో శృంగార సంబంధాలు కూడా ఉంటాయి.
కాగా.. ప్రతి బంధాన్ని మెరుగుపరుచుకోవడం.. ఆ బంధాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. అలా లేకపోతే.. ఆ బంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సంగతి పక్కన పెడితే.. మీన రాశివారు .. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో... వారి గురించి భయంకరమైన నిజాలు తెలుసుకుందామా..
మీన రాశివారు ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్. వీరు చాలా సహజమైన, సున్నితమైన, శృంగార భరితమైన ప్రేమను కోరుకుంటారు. వీరికి ఆత్మీయ సన్నిహితులు జీవితంలోకి రావాలని కోరుకుంటారు. వీరిదీ డీప్ లవ్. అలాంటి ప్రేమే ఎదుటి వారి నుంచి కోరుకుంటారు. వీరితో జీవితంలో రోలర్ కోస్టర్ లా ఉంటుంది. వీరు.. తాము ప్రేమించిన వారికి అన్ని ఎమోషన్స్ ని పరిచయం చేస్తారు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా సింపుల్ గా ఉండదు వీరితో. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
ఈ రాశివారు.. రొమాన్స్ విషయంలో కాస్త వెనకపడతారు. ఆ విషయంలో తేడాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. అలా విడిపోతే.. మళ్లీ కొత్త బంధానికి అలవాటుపడటం వీరికి చాలా కష్టం. విడిపోయిన వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ తప్పు వీరిపై ఉంటే మాత్రం.. మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటారు.
friendship
మీన రాశివారు గొప్ప స్నేహితులు అని చెప్పొచ్చు. వారు చాలా సెన్సిటివ్. స్నేహితులకు సహాయం చేయడానికి ముందు ఉంటారు. స్నేహితులు బాధలో ఉన్నప్పుడు.. ఓదార్చడానికి ముందుంటారు.
kids
ఈ రాశివారు చిన్నపిల్లలుగా ఉంటే.. వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అది వారి జీవితాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. వీరికి తెలిలవి తేటలు ఎక్కువ. ఆటల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెరుగుతున్న కొద్దీ వీరిలో నైపుణ్యం పెరుగుతుంది.
ఈ రాశివారు.. తల్లిదండ్రులు గామారిన తర్వాత.. వీరికి సెంటిమెంట్లు ఎక్కువ. భక్తి భావం ఎక్కువ. వీరిలో కేరింగ్ నేచర్ ఎక్కువ. పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. వీరు పిల్లలను బాగా అర్థం చేసుకుంటారు.