Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు గొప్ప తండ్రులు అవ్వగలరు..!
Birth Stars: పిల్లలపై ప్రతి తల్లిదండ్రులకు చాలా ప్రేమ ఉంటుంది. కానీ, జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మాత్రం తమ పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు.

Zodiac signs
ప్రతి మనిషి వ్యక్తిత్వంలో నక్షత్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మరి కొందరు ప్రేమతో నిండిన హృదయం కలిగి ఉంటారు.అదేవిధంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భవిష్యత్తులో అద్భుతమైన తండ్రులుగా మారగలరు.వీరు తమ పిల్లలపై అమితమైన ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. మరి, ఆ నక్షత్రాలేంటో ఓసారి చూద్దాం...
మృగశిర నక్షత్రం...
మృగశిర నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వారు ఎవరితో అయినా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. ఇక, తన కన్న బిడ్డలపై అమితమైన ప్రేమ చూపించగలరు. పిల్లలకు మంచి విలువలు నేర్పిస్తారు. పిల్లలు తప్పు చేసినా కోపం చూపించరు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ పిల్లలు ఏం కోరుకుంటున్నారో నోరు విప్పి చెప్పకపోయినా వీరు బాగా అర్థం చేసుకోగలరు. తండ్రిలా కాకుండా.. మంచి స్నేహితుడిలా ఉంటారు. పిల్లల దగ్గరకు కష్టం రానివ్వకుండా చూసుకుంటారు.
పునర్వసు నక్షత్రం....
పునర్వసు నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు తమ కుటుంబం మొదటి స్థానంలో ఉంటుంది. వీరు నిత్యం తమ కుటుంబం ముఖ్యంగా, తమ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసం తమ సంతోషాన్ని కూడా త్యాగం చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి విద్య, మంచి అలవాట్లు పెంచడానికి వీరు చాలా ఎక్కువగా ప్రయత్నిస్తారు. తమ పిల్లల జీవితంలో స్ఫూర్తి నింపుతారు.
హస్త నక్షత్రం...
హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. కానీ, వారి మనసు మాత్రం చాలా గొప్పది. తమ పిల్లలతో మంచి స్నేహితుల్లా ఉంటారు. పిల్లల్లో సృజనాత్మకత పెంచడంలో ముందుంటారు. తమ పిల్లల చిన్న విజయాలను కూడా చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. పిల్లలు తప్పు చేసినా శిక్షించకుండా, ప్రేమతో వారి తప్పు సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.
4.అనురాధ నక్షత్రం....
అనురాధ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా తమ పిల్లల కోసం ప్రాణం అయినా ఇస్తారు. తమ పిల్లలను ఎప్పుడూ సేఫ్ గా, కంఫర్ట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లల మనసు దెబ్బతినకుండా మాట్లాడటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఒక తండ్రిగా తమ పిల్లల ప్రతి కష్టంలోనూ తోడుంటారు. ఒక రక్షణ కవచంలా నిలుస్తారు.
5.రేవతి నక్షత్రం...
రేవతి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు ఓపిక చాలా ఎక్కువ. వీరు తమ పిల్లల పట్ల చాలా ఎక్కువ కేర్ చూపిస్తారు. పిల్లలకు కలలు కనడం,వాటిని నేరవేర్చుకోవడానికి ఎంత కష్టపడాలో నేర్పిస్తారు. పిల్లల మంచి గా, నిజాయితీగా పెరగడానికి సహాయపడతారు. తమ పిల్లలను ఉన్నతమైన వారిగా పెంచడంలో వీరు తమ వంతు కృషి చేస్తారు.

