Venus Transit: డిసెంబర్ లో శుక్ర సంచారం... ఈ నాలుగు రాశుల తలరాత మారనుంది..!
Venus Transit: శుక్ర నక్షత్ర పరివర్తన నవంబర్ 29వ తేదీన జరగనుంది. ఈ శుక్ర సంచారం.. కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

శుక్ర సంచారం...
ఈ శుక్ర సంచారము కారణంగా, డిసెంబర్ మొదటి రెండు వారాలు అనేక రాశులకు శుభప్రదమైనవి, అదృష్టవంతులుగా కూడా పరిగణిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 9న శుక్రుడు సూర్యుని రాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 29న శుక్ర సంచారం కారణంగా ఏ రాశులకు అదృష్టంగా మారనుందో తెలుసుకుందాం....
వృషభ రాశి...
శుక్ర సంచారం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు, అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి...
శుక్ర సంచారం కర్కాటక రాశివారి విశ్వాసాన్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టిన ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు.
తుల రాశి....
శుక్రుడి సంచారం తుల రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. పని, చదువులు, లేదా కొత్త వ్యాపారాలు ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ప్రయాణం, సమావేశాలు లేదా సంభాషణలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీర గతంలో కంటే తేలికగా, సానుకూలంగా భావిస్తారు. సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
శుక్ర సంచారం మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరి కెరీర్ అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో లాభాలు పొందుతారు. ఉద్యోగ పరంగా మీరు చేసే ప్రతి పనీ మీకు అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం పొందుతారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అని చూస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

