MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కలలో గబ్బిలాలు కనిపించాయా? అయితే జాగ్రత్త!

కలలో గబ్బిలాలు కనిపించాయా? అయితే జాగ్రత్త!

కలలో కనిపించే కొన్ని వస్తువులు శుభప్రదంగా, మరికొన్ని వస్తువులను అశుభంగా భావిస్తారు. అయితే జీవితంలో వీటిని చూడొద్దనే వాటిని కూడా కలలో చూస్తుంటారు. వీటిలో గబ్బిలాలు ఒకటి. జ్యోతిషశాస్త్రంలో గబ్బిలాలను చూడటం అశుభంగా భావిస్తారు.
 

R Shivallela | Published : Oct 29 2023, 10:27 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
bad dreams

bad dreams

మన జీవితంలో డ్రీమ్ సైన్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. కొందరికి రోజూ కలలు పడుతుంటే.. మరికొందరికి అపుడప్పుడు కలలు పడుతుంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మన కలలో కొన్ని వస్తువులను చూడటం శుభప్రదంగా, మరికొన్ని వస్తువులను చూడటం అశుభంగా పరిగణిస్తారు. అయితే మనం వీటినెప్పుడూ చూడకూడదు అనే వాటిని కూడా కలలో చూస్తుంటాం. వీటిలో గబ్బిలాలు ఒకటి. అయితే జ్యోతిషశాస్త్రంలో గబ్బిలాలను చూడటం అశుభంగా భావిస్తారు. మరి దీనిని కలలో చూడటం గురించి జ్యోతిష్యం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

24
bad dreams

bad dreams

గబ్బిలాల దాడి..

కలలో గబ్బిలాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. అయితే కలలో మిమ్మల్ని గబ్బిలాలు దాడి చేయడం చెడుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు. మీకు ఈ కల పడితే మీరు ఏదో చెడు వ్యసనానికి బలైపోతారని అర్థం వస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తి గురించి మీరు చెడుగా అనుకునే అవకాశం కూడా ఉంది. 
 

34
Asianet Image

కలలో గబ్బిలాలను చూస్తే..

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీ కలలో మీరు గబ్బిలాలను చూసినట్టేతై మీకేదో చెడు జరగబోతుందని అర్థం వస్తుంది. ఈ కల చెడు సంకేతమంటున్నారు జ్యోతిష్యులు. ఇలాంటి కల మీరు భవిష్యత్తులో జరిగే అశుభ ఘటనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం వస్తుంది.. ఈ కల మిమ్మల్ని ఒక పెద్ద భయం చుట్టుముట్టిందని సూచిస్తుంది. దీని గురించి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
 

44
<p>Bats</p>

<p>Bats</p>

గబ్బిలాల గుంపును చూస్తే..

మీరెప్పుడైనా మీ కలలో గబ్బిలాల గుంపును చూసారా? అయితే మీ విధి మిమ్మల్ని విడిచిపెట్టబోతోందని అర్థం చేసుకోండి. అలాగే ఈ కల మీకు అస్సలు మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలాంటి కలను చూసిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కల మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టపోవడాన్ని సూచిస్తుంది. 

R Shivallela
About the Author
R Shivallela
జ్యోతిష్యం
 
Recommended Stories
Top Stories