Vastu Tips: బాత్రూమ్ లో అద్దం పెట్టకూడదా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
బాత్రూమ్ వంటి ప్రదేశాలు ప్రతికూల శక్తిని సులభంగా ఆకర్షిస్తాయని భావిస్తారు. కాబట్టి, ఇంట్లో మంచి వాతావరణం ఉండాలన్నా, పాజిటివిటీ పెరగాలన్నా.. కచ్చితంగా బాత్రూమ్ వాస్తు చాలా ముఖ్యం.

బాత్రూమ్ విషయంలో చేయకూడని పొరపాట్లు..
వాస్తు శాస్త్రం మన ఇంటికి సానుకూల శక్తి, ఆరోగ్యం, శ్రేయస్సు, ధన సంపదను తీసుకురావడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇంటి ప్రతి గది, ప్రతి మూలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆ శక్తి సరిగా ఉండాలంటే వాస్తు నియమాలను పాటించడం అవసరం. ముఖ్యంగా బాత్రూమ్ వంటి ప్రదేశాలు ప్రతికూల శక్తిని సులభంగా ఆకర్షిస్తాయని భావిస్తారు. కాబట్టి, ఇంట్లో మంచి వాతావరణం ఉండాలన్నా, పాజిటివిటీ పెరగాలన్నా.. కచ్చితంగా బాత్రూమ్ వాస్తు చాలా ముఖ్యం. మరి.. బాత్రూమ్ లో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం...
బాత్రూమ్ కట్టకూడని ప్రదేశాలు...
ఇంట్లో ఈశాన్య భాగం, మధ్య భాగం( బ్రహ్మస్థానం)లను అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణిస్తారు. ఇది దైవిక, సానుకూల శక్తి నిలయాలు. కాబట్టి.. ఈ ప్రదేశాల్లో బాత్రూమ్ ని పొరపాటున కూడా కట్టకూడదు. ఇది వాస్తుకు విరుద్ధం.
బాత్రూమ్ కి సరైన దిశ...
సాధారణంగా బాత్రూమ్ నిర్మించడానికి ఆగ్నేయం లేదా నైరుతి దిక్కులు చాలా ఉత్తమం. బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కోసం వాయువ్యం (Northwest) లేదా వాయువ్య పశ్చిమం (West of Northwest) అనుకూలంగా ఉంటుంది.
బాత్రూమ్ తలుపు ఎల్లప్పుడూ మూసి ఉంచండి
బాత్రూమ్ తలుపు, టాయిలెట్ సీటు ఎప్పుడూ మూసివేయాలి. ఇది ఇంటిలో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.
సరైన వెంటిలేషన్ ఉండాలి
బాత్రూమ్‌లో గాలి ప్రసరణ చాలా ముఖ్యం. తూర్పు లేదా ఉత్తర గోడపై కిటికీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేలా చూసుకుంటే సహజ కాంతి, శుభ్రమైన గాలి లోపలికి వస్తాయి.
శుభ్రతపై దృష్టి పెట్టండి
బాత్రూమ్ మురికిగా ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి శుభ్రంగా, వాసనలేని వాతావరణంగా ఉంచడం చాలా అవసరం.
లీకేజీలను నిర్లక్ష్యం చేయకండి
కుళాయి లేదా పైపు నుంచి నీరు కారడం ఆర్థిక నష్టానికి, శక్తి వృథాకు సంకేతంగా పరిగణిస్తారు. కాబట్టి లీకేజీ వస్తే వెంటనే మరమ్మత్తు చేయాలి.
అద్దం సరిగా అమర్చండి
బాత్రూమ్ తలుపు ఎదుట నేరుగా అద్దం పెట్టకూడదు. ఇది ప్రతికూల శక్తి ఇంట్లోకి వ్యాపిస్తుందని వాస్తు చెబుతుంది.
నీటి పారుదల సరైనదిగా ఉండాలి
బాత్రూమ్ నేల ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపు వాలుగా ఉండాలి. ఇలా చేస్తే నీరు సరిగా పారిపోతుంది. ఇది ప్రతికూలత తొలగింపును సూచిస్తుంది.