MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టినవారితో వైరం అస్సలు మంచిది కాదు.. టైం చూసి దెబ్బకొడతారు!

Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టినవారితో వైరం అస్సలు మంచిది కాదు.. టైం చూసి దెబ్బకొడతారు!

Birth Stars: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి నక్షత్రానికి ప్రత్యేక స్వభావం ఉంటుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు కోపాన్ని వెంటనే చూపిస్తే, మరికొందరు తమ ఎమోషన్స్ ని మనసులోనే దాచుకొని సరైన టైం కోసం ఎదురుచూస్తారు. అలాంటి నక్షత్రాల గురించి చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Jun 25 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ నక్షత్రాల్లో పుట్టిన వారితో వైరం మంచిది కాదు?
Image Credit : Asianet News

ఏ నక్షత్రాల్లో పుట్టిన వారితో వైరం మంచిది కాదు?

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేక ఆలోచనా విధానం, ప్రతిస్పందన తీరు ఉంటుంది. కొంతమంది చిన్న విషయానికే ఆవేశపడితే, మరికొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా బయటకు ప్రశాంతంగానే కనిపిస్తారు. కానీ టైం చూసి దెబ్బ కొడతారు. వీరు తమకు జరిగిన అన్యాయాన్ని అంత సులభంగా మర్చిపోరు. అందుకే వీరితో వైరం పెట్టుకోవడం మంచిది కాదని పండితులు చెబుతుంటారు. మరి ఏ నక్షత్రాల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మఖ నక్షత్రం
Image Credit : Asianet News

మఖ నక్షత్రం

పండితుల ప్రకారం మఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. వీరు పైకి చాలా సాఫ్ట్ గా, ఫ్రెండ్లీగా కనిపించినప్పటికీ తమ మనసులో చాలా విషయాలు దాచుకుంటారు. ఎవరు ఎలా ప్రవర్తించారో, ఎవరు సహాయం చేశారో, ఎవరు ఇబ్బంది పెట్టారో అన్నీ గుర్తుపెట్టుకుంటారు. అందుకే వీరిని తక్కువ అంచనా వేయడం, శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

35
ఆశ్లేష నక్షత్రం
Image Credit : Pinterest

ఆశ్లేష నక్షత్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు పరిస్థితులను నిశితంగా గమనించే స్వభావం కలిగి ఉంటారు. తమ భావాలను బయటకు ఎక్కువగా వ్యక్తం చేయరు. ఒకరి గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి వస్తారు. ఒకసారి ఎవరైనా మోసం చేశారని భావిస్తే వెంటనే ప్రతిస్పందించకుండా సరైన సందర్భం కోసం వేచి చూస్తారు.

45
జ్యేష్ఠ నక్షత్రం
Image Credit : Getty

జ్యేష్ఠ నక్షత్రం

జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినవారు ఆత్మగౌరవానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. తమ గౌరవానికి భంగం కలిగితే అంత సులభంగా మర్చిపోరు. అయితే వీరు నేరుగా గొడవలకు వెళ్లే కంటే తమ సామర్థ్యంతో ఎదిగి ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలనుకుంటారు. వీరి విజయమే కొన్నిసార్లు వారికి జరిగిన అవమానాలకు సమాధానంగా మారుతుంది.

55
అనూరాధ నక్షత్రం
Image Credit : Getty

అనూరాధ నక్షత్రం

అనూరాధ నక్షత్రంలో పుట్టినవారు స్నేహానికి విలువిస్తారు. కానీ నమ్మినవారే మోసం చేస్తే తీవ్రంగా బాధపడతారు. ఆ బాధను బయటకు చూపించకుండా తమలో తామే దాచుకుంటారు. కాలం వచ్చినప్పుడు తమ ప్రతిభతో లేదా నిర్ణయాలతో తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్ పర్సన్స్.. ఒక్కసారి కనెక్ట్ అయితే వదిలిపెట్టరు!
Recommended image2
Dream Astrology: కలలో ఇవి కనిపిస్తే జాగ్రత్త.. చెడుకి సంకేతాలు కావచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved