ఈ రాశులవారు తమ పార్ట్ నర్ ని అస్సలు మోసం చేయరు..!
ఒకరిపై ఒకరు నమ్మకం ఉన్నప్పుడు.. తమ పార్ట్ నర్ ని మోసం చేయకూడదు అనే భావన.. ఈ రెండు ఉన్నప్పుడే.. ఆ బంధం పరిపూర్ణమౌతుంది . అవి సంబంధానికి పునాది. కాగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తమ పార్ట్ నర్ ని ఎప్పటికీ మోసం చేయరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

astrology
అన్ని సంబంధాలలో నమ్మకం, విశ్వాసం , విధేయత చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరు నమ్మకం ఉన్నప్పుడు.. తమ పార్ట్ నర్ ని మోసం చేయకూడదు అనే భావన.. ఈ రెండు ఉన్నప్పుడే.. ఆ బంధం పరిపూర్ణమౌతుంది . అవి సంబంధానికి పునాది. కాగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తమ పార్ట్ నర్ ని ఎప్పటికీ మోసం చేయరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..
మేష రాశి
ఈ రాశివారు.. ఎవరినీ మోసం చేయరు. ఒకవేళ చేయాల్సి వచ్చి చేశారు అంటే మాత్రం.. ఎప్పటికీ దొరకరు. వీరిని పట్టుకోవడం చాలా కష్టం. దాదాపు 90శాతం వరకు వీరు ఎవరినీ మోసం చేయాలని కూడా అనుకోరు. వీరు.. నిజానికి చాలా మృదు స్వభావులు. ఎదుటి వారి ప్రేమను దోచుకోవాలని అనుకుంటారు కానీ.. ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోరు. స్నేహితులకు కూడా ద్రోహం చేయరు.
వృషభం
ఈ వృషభ రాశి అత్యంత నిజాయితీ గల రాశిగా చొప్పచ్చు. ఎవరితోనైనా చాలా నిజాయితీగా ఉంటారు. మనసులో ఓ మాట దాచుకొని.. పైకి ఒక మాట చెప్పే రకం కాదు. ఇక.. తమతో నిజాయితీగా ఉన్నవారితో.. వారు మరింత నిజాయితీగా ఉంటారు. స్నేహానికి, తమ పార్ట్ నర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు. తమను ఎవరైనా మోసం చేస్తే మాత్రం .. వారిని అస్సలు క్షమించరు.
తులారాశి
వీరు జీవితంలో అన్ని రిలేషన్స్ కి బాగా విలువ ఇస్తారు. స్నేహాలు, సంబంధాలు - ఏదీ ఆట కాదని వారికి బాగా తెలుసు. వారు తమ మొత్తం శక్తిని సంబంధాలను కొనసాగించడానికి పెట్టగలరు. ఎప్పుడూ తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎవరినీ మోసం చేయరు. మోసపోరు కూడా. ఎవరితోనైనా ఏదైనా మాట పట్టింపు వచ్చినా.. మళ్లీ చక్కపెట్టుకోగలరు. ప్రేమ విషయంలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు.
వృశ్చికరాశి
ఈ రాశివారికి ఎప్పుడు.. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు. తమను ఇష్టపడేవారిని.. తాము ఇష్టపడేవారితో.. చాలా నిజాయితీగా ఉంటారు. ఎదుటివారి మనసును గాయపరిచే, చికాకు కలిగించే పనిని ఈ రాశివారు చేయలేరు. ఈ రాశివారు.. చాలా నిబద్దతతో ఉంటారు. ఎవరినీ మోసం చేయాలని అనుకోరు. తాము నమ్మిందే నిజం అని అనుకుంటారు..
మకరం
మకర రాశి విశ్వాసులకు జీవిత లక్ష్యం. ఉన్నత ఆశయాలు ఉన్నవారు తాము నమ్మిన ఆదర్శంగా జీవిస్తున్నారు. మరొకరికి, ఇది నొప్పి లేదా ఇబ్బంది కలిగించేది కాదు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇతరులకు సహాయం చేయగల వ్యక్తి ఎల్లప్పుడూ సరైనది చేయడానికి ఇతరులను ప్రేరేపించగలడు. డబ్బు విషయంలో మాట వదులుకున్న వారిని దూరం పెడతారు. జీవిత భాగస్వామి ని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు.