Astrology: మార్చి నుంచి ఈ రాశివారికి ఏలినాటి శని మొదలవుతుందా?
ఇంకో పది రోజులైతే ఫిబ్రవరి నెల పూర్తయి మార్చి ప్రారంభం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో మేష రాశి వారికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో మేషరాశికి అధిపతి అయిన కుజుడు అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. దాని వల్ల ఆదాయం పెరుగుతుంది.
కానీ మేషరాశి వారు మార్చి నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలట. వృత్తి కారకుడు అనుకూలంగా ఉన్నప్పటికీ శని దేవుడు ప్రతికూల స్థితిలో ఉన్నాడు. కానీ శని బలహీనంగా కూడా ఉన్నాడు. అందువల్ల, ఏదైనా ఆలోచించి చేయడంతో పాటు జాగ్రత్తగా కూడా ఉండాలి.
గురు చంద్రయోగం
సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ శని దేవుని ప్రతికూల స్థితి కారణంగా సూర్య భగవానుని పూర్తి ఫలితం లభించదు. అంటే సులభంగా పూర్తి కావాల్సిన పనికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. గురు చంద్ర యోగం కారణంగా పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. ధర్మ మార్గంలో ధనం సమకూరుతుంది. కుటుంబంలో ఐక్యత, ఆనందం పెరుగుతుంది.
లవ్ లైఫ్ లో సమస్యలు
రక్తసంబంధీకులతో సమస్యలు ఉండవు. వారితో ఐక్యంగా ఉంటారు. సూర్యుడు లాభ స్థానంలో ఉన్నప్పటికీ శని ప్రభావం కారణంగా లవ్ లైఫ్ లో సమస్యలు పెరుగుతాయి. వైవాహిక సంబంధంలో కూడా గొడవలు రావచ్చు. అంతేకాకుండా ఈ నెల నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది.
పాప పుణ్యాలకు ఫలితం
గత కొన్ని ఏళ్లలో మీరు చేసిన పాప పుణ్యాలకు అనుగుణంగా ఫలితం లభిస్తుంది. మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది. చెడు చేసి ఉంటే చెడు ఫలితాలు వస్తాయి. సూర్యుడు మీకు లాభ స్థానంలో ఉన్నప్పటికీ లవ్ లైఫ్ లో శని ప్రభావం కారణంగా సమస్యలు రావచ్చు. కాస్త సర్దుకొని పోతే ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.