MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఈ రాశివారి చాలా పొదుపరులు..అస్సలు ఖర్చు చేయరు..!

ఈ రాశివారి చాలా పొదుపరులు..అస్సలు ఖర్చు చేయరు..!

మరి ఎవరు ఖర్చు చేస్తుంటారు.. ఎవరు డబ్బులు పొదుపు చేస్తుంటారు అనే విషయాన్ని.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.. 

3 Min read
Author : ramya Sridhar
| Updated : Sep 15 2021, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

కొందరు చేతిలో డబ్బులు ఉంటే.. ఖర్చు చేసేంత వరకు నిద్రపోరు. ఇంకొందరు.. చాలా పొదుపుగా ఉంటారు. తమ పర్స్ లోని డబ్బులను ఖర్చు పెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. మరి ఎవరు ఖర్చు చేస్తుంటారు.. ఎవరు డబ్బులు పొదుపు చేస్తుంటారు అనే విషయాన్ని.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
మేష రాశివారు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అయితే.. నిజానికి ఈ రాశివారు ఎక్కువగా ఖర్చు చేయడం అంత మంచిది కాదట. అందుకే.. వీరు షాపింగ్ కి వెళ్లినా కూడా ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండగలగాలట. అలా చేసినప్పుడే.. వారు నిలదొక్కగలుగుతారు.

313

2.వృషభ రాశి..

ఈ రాశివారు ఎప్పుడూ లగ్జరీ గా బతకాలని కోరుకుంటారు. అయితే.. అవసరం వరకు మాత్రం ఖర్చు చేయడంలో ఎలాంటి  తప్పు లేదు. అలా కాకుండా.. లగ్జరీ వస్తువుల కోసం ఖర్చు పెట్టకుండా.. నాణ్యత గల ఉత్పత్తులపై ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు.. జీవితంలో ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో అని చాలా భయపడుతూ ఉంటారు. కాబట్టి.. ఎప్పుడూ పొదుపు పై దృష్టి పెడతారు.  అనవసరం లేని విషయాలపై మాత్రం ఎక్కువగా ఖర్చు చేయరు. వీరు చాలా పొదుపు అనే చెప్పొచ్చు.
 

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు.. ఎక్కడ తక్కువ ఖర్చుతో లభిస్తాయి అనే విషయం తెలిస్తే.. అక్కడకు వెళ్లి కొనుక్కుంటూ ఉంటారు.  ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా..  వీళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఆలోచించకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లరు.

613


8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు డబ్బును ఆదా చేయడంలో ముందుంటారు. అయితే.. ఎంత ఆదా చేస్తారో.. అంతా  ఒకేసారి వారికి తెలీకుండానే ఖర్చు అయిపోతుంది. కాబట్టి.. ఈ విషయంలో ఈ రాశివారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి.

713

5.సింహ రాశి..
డబ్బు ఎలా  ఖర్చు చేయాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. ఆర్థికంగా ఎప్పుడు ఎలా ఉండాలనే విషయం వీరికి మంచి అవగాహన ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఆదా చేస్తూ ఉంటారు. చాలా తెలివిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు.

813

6.కన్య రాశి..
ఈ రాశివారు డబ్బు ఖర్చు చేసే ముందు అన్ని  వివరాలను విశ్లేషిస్తుంటారు. వస్తువుకు విలువ ఉంది అంటే.. కచ్చితంగా.. డబ్బు ఖర్చు పెడతారు. లేదు.. ఆ వస్తువు కి అంత సీన్ లేదు అనుకుంటే.. మాత్రం  ఖర్చు చేయరు. ఆ వస్తువు విలువను  బట్టి వీరు ఖర్చు  చేస్తూ ఉంటారు.

913

7.తుల రాశి..
ఈ రాశివారు చాలా తెలివి ఎక్కువ. ఈ రాశివారు తమ ఖర్చులను, అలవాట్లను బ్యాలెన్స్ చేస్తుంటారు. ఒక వస్తువు కోసం ఎక్కువ ఖర్చు చేస్తే.. మరో దగ్గర దానిని బ్యాలెన్స్ చేస్తుంటారు. వీళ్లు డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారనే విషయం ఎవరికీ అర్థం కాదు. చాలా బ్యాలెన్స్ డ్ గా మనీ ఖర్చు చేస్తారు.

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు వారి దుస్తులు, ఆహారానికి ఎక్కువ ఖర్చు చేయరు. కానీ.. ప్రయాణాలకు, సాహసాలకు, ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మాత్రం చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. వీటి కోసం మాత్రం ఎక్కడా తగ్గరు.
 

1113

10.మకర రాశి..
వీళ్లు డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా బాధ్యత గా ఉంటారు. ఎక్కువ కాలం నాణ్యత గా ఉండేవాటిపై మాత్రమే ఖర్చు పెడతారు. మిగిలిన వాటిపై ఖర్చు చేయాలని వీరు అనుకోరు. ఎక్కువగా వీరు డబ్బును పెట్టుబడుల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలనే ఎక్కువగా ఎంచుకుంటారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు ప్రతి దాని గురించి క్షుణ్నంగా ఆలోచిస్తారు. ఎలా పడితే అలా అస్సలు ఖర్చు చేయరు. వీరికి ఆర్థిక లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి. రూపాయి ఆదా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువగా కోరుకుంటారు. స్వతంత్రంగా రూపాయి దాచి పెట్టాలని అనుకుంటారు. 

1313

12. మీన రాశి..
ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా ఎమోషనల్ గా ఉంటారు. స్నేహితులు, కుటుంబసభ్యుల సహాయంతో.. వీరు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు.  ఆర్థిక సలహాదారుల సహాయంతో డబ్బు ఆదా చేస్తుంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image2
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image3
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved