Birth Date: ఈ తేదీలలో పుట్టిన మగవారు ఉత్తమ భర్తలుగా ఉంటారు, వీరి భార్యలు ఎంతో లక్కీ
Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన పురుషులకు ఉత్తమ భర్తలు అయ్యే లక్షణాలు ఉంటాయి.వారి భార్యలు ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అవి ఏ తేదీలో తెలుసుకోండి.

ఉత్తమ భర్తలు
సంఖ్యా శాస్త్రంలో పుట్టిన తేదీకి ఎంతో విలువ ఉంటుంది. అది వారి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, జీవిత మార్గాన్ని సూచిస్తుంది. అందుకు సంబంధించిన లోతైన రహస్యాలను వెల్లడిస్తుంది. పుట్టిన తేదీలోని సంఖ్యలు ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం, నిర్ణయం తీసుకోవడంలో ఉండే సత్తాను కూడా చూపుతుందని న్యూమరాలజీ చెబుతోంది. పురుషుల్లో కొన్ని తేదీల్లో పుట్టిన వారు ఉత్తమ భర్తలగా ఉంటారని వారి భార్యలను బంగారంలా చూసుకుంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
ఈ తేదీలలో పుట్టిన వారు
ఏ నెలలోనైనా 2, 11, 20, 29.. తేదీలలో జన్మించిన పురుషుల రాడిక్స్ సంఖ్య రెండుగా ఉంటుంది. ఈ రెండును పాలించేది చంద్రుడు. కాబట్టి వీరి భావోద్వేగాలు, మనస్సు స్వచ్ఛమైనవి. చంద్రుని ప్రభావం కారణంగా ఈ వ్యక్తులు ఎన్నో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు.
2 రాడిక్స్ సంఖ్య
రెండు రాడిక్స్ సంఖ్య కలిగిన పురుషులు సాధారణంగానే ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారు కష్టపడి పనిచేస్తారు. పని వాతావరణం, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుతారు. వారు ఏకాగ్రతతో జీవితంలో అనుకున్నది సాధిస్తారు.
ఆదర్శ భర్త
రాడిక్స్ సంఖ్య రెండు కలిగిన పురుషులు, భార్యలకు ఆదర్శ భర్తగా ఉంటారు. వారి తమ జీవిత భాగస్వామిని విపరీతంగా ప్రేమిస్తారు. వారి భావాలను అర్థం చేసుకుంటారు. అవసరాలను తీరుస్తారు. వారిని దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారి ప్రేమ, అంకిత భావం అనేది వైవాహిక జీవితంలో పరిపూర్ణతను తీసుకొస్తుంది.
కుటుంబానికి విలువ ఇస్తారు
ఈ పురుషులు కుటుంబానికి ఎంతో విలువిస్తారో. కుటుంబ సభ్యులపై ప్రేమను కురిపిస్తారు. కేవలం తాము పుట్టిన ఇంట్లోనే కాదు. అత్తమామల కుటుంబాలతో కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వారి భావోద్వేగ సంబంధం ఎంతో బలంగా ఉంటుంది. ఈ పురుషులు తమ భార్యల కష్ట సుఖాలలో తోడుగా ఉంటారు. వారికి ప్రేమ, భావోద్వేగ మద్దతును అందిస్తారు. భార్యలపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు.. వారి కలలని నెరవేర్చేందుకు ఎంతో కష్టపడతారు.