మీ కలలో ఆడవారు కనిపించారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే.!
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే కలలు మనకు ఎన్నో సంకేతాలను అందిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం.. కలలో ఆడవాళ్లను చూడటం శుభమా? అశుభమా అంటే..
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మన కలలు మనకు మన భవిష్యత్తు గురించి ఎన్నో సంకేతాలను అందిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం.. కలలు మన భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి మనల్ని హెచ్చరిస్తాయని అంటుంటారు. కొన్ని కలలు మనల్ని సంతోషపెట్టేవిగా ఉంటే.. మరికొన్ని బాధకలిగించేవిగా ఉంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఆడవారిని కలలో చూడటం శుభం, అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. కలలో ఆడవాళ్లను ఏ రూపంలో చూడటం శుభమో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం నిద్రలోకి జారుకున్నా.. మన బ్రయిన్ మాత్రం పనిచేస్తూనే ఉంటుది. చాలా మందికి నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు కంటుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక్కో కలకూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో కలలు పడితే అవి వారం రోజుల్లో మన నిజజీవితంలో నిజమవుతాయని అంటున్నారు జ్యోతిష్యులు.
వృద్ధురాలిని చూస్తే..
కలలో వృద్ధురాలిని చూడటం శుభప్రదంగా భావించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. వృద్ధ మహిళలను కలలో చూడటం వల్ల భవిష్యత్తులో మీ సంపద, ప్రతిష్ఠ పెరుగుతుందని సంకేతం.
నగలు ధరించిన మహిళను చూస్తే..
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు కలలో ఒంటినిండా ఆభరణాలు ధరించిన ఆడవారిని చూసినట్టైతే.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయని సంకేతం. అందుకే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అందమైన అమ్మాయిని చూస్తే..
అందమైన ఆడవారిని లేదా దేవదూతను కలలో చూడటం కూడా శుభ సంకేతంగా భావిస్తారు. ఇలాంటి కల మీకు పడితే మీ ఇంట్లో వైరుధ్యాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
చిరునవ్వులు చిందిస్తున్న అమ్మాయిని చూస్తే..
అమ్మాయిల నవ్వు అందంగా, చూడచక్కగా ఉంటుంది. అందుకే ఎవరైనా అమ్మాయి నవ్వుతుంటే కన్ను ఆర్పకుండా చూస్తుంటారు. అయితే మీరు కలలో ఒక అమ్మాయి నవ్వును చూస్తే మీకు అంతా మంచే జరుగుతుందని అర్థం. మీ కలలో అమ్మాయి నవ్వితే మీ జీవితంలోకి త్వరలోనే సంపద వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.