Zodiac Signs: వందేళ్ల తరువాత ఏర్పడబోతున్న అద్భుతం.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు
వందేళ్ల తరువాత దీపావళి రోజున శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. అదే మహాలక్ష్మీ రాజయోగం. కుజ చంద్రుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల (Zodiac Signs) వారికి విపరీతంగా ధనం కలిసి రావచ్చు.

మహాలక్ష్మి రాజయోగం 2025
జ్యోతిష్యాన్ని మనదేశంలో నమ్మేవారు చాలా ఎక్కువ. రాశులను బట్టి తమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న నిర్వహించుకోబోతున్నాం. గత నెల సెప్టెంబర్ 23న తులారాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అతడు అక్కడే అక్టోబర్ 27 వరకు ఉంటాడు. అదే సమయంలో చంద్రుడు కూడా తులారాశిలో కలవడంతో అక్టోబర్ 21న మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం ఎన్నో రాశుల వారికి విపరీతంగా కలిసివచ్చేలా చేస్తుంది.
కర్కాటక రాశి
మహాలక్ష్మి రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగం, వృత్తి విషయాల్లో వారు అనుకూల ఫలితాలు వస్తాయి. జీవితంలో కూడా సానుకూల మార్పులు ఏర్పడతాయి. అన్ని పనుల్లో విజయం సాధించడం తథ్యం. నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగం అందించే అవకాశం. మంచి ఆదాయం వచ్చే వ్యాపారాలు చేస్తారు. కొత్త వాహనం, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మకర రాశి
మహాలక్ష్మి రాజయోగం వల్ల మకర రాశి వారికి అన్నీ అనుకూల ఫలితాలే కలుగుతాయి. ఈ రాజయోగం మీ జాతకంలో కర్మ స్థానంలో ఏర్పడబోతోంది. దీనివల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. సమాజంలో ఎంతో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఇది కలిసొచ్చే కాలం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం మంచి రోజులను మోసుకొస్తుంది. మీకు ఈ యోగం సంపద, వాక్కు స్థానంలో ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల మీరు ఊహించని ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వారి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. మీ ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు కలిసి వస్తుంది.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిషశాస్త్ర అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగంపై ఆధారపడింది. ఏషియానెట్ తెలుగు దీన్ని ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏషియానెట్ తెలుగు బాధ్యత వహించదు)